అంతర్జాతీయం

ఉగ్రవాదంపై కఠిన చర్య అవసరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మార్చి 30: ఉగ్రవాదంపై యుద్ధంలో భారత ప్రభుత్వానికి, దేశ ప్రజలకు అమెరికా దన్నుగా నిలుస్తున్న నేపథ్యంలో పాకిస్తాన్ తన గడ్డమీది నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఉగ్రవాదులు, ఉగ్రవాద సంస్థలపై అర్థవంతమయిన, తిరుగులేని, నిరూపణీయమయిన చర్య తీసుకోవలసిన అవసరం ఉందని భారత్, అమెరికాలు నొక్కి చెప్పాయి. పాకిస్తాన్ కేంద్రంగా పనిచేస్తున్న జైష్ ఎ మహ్మద్ (జేఈఎం) ఉగ్రవాద సంస్థ జమ్మూకాశ్మీర్‌లోని పుల్వామాలో ఫిబ్రవరి 14వ తేదీన ఆత్మాహుతి బాంబు దాడికి పాల్పడి 40 మంది సీఆర్‌పీఎఫ్ జవాన్లను పొట్టన పెట్టుకున్న విషయం తెలిసిందే. దీంతో పాకిస్తాన్ గడ్డమీది నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తున్న అన్ని ఉగ్రవాద సంస్థలను నాశనం చేయాలని ఆ దేశాన్ని అంతర్జాతీయ సమాజం డిమాండ్ చేసింది. ఈ నేపథ్యంలో అమెరికా-్భరత్ కౌంటర్-టెర్రరిజం జాయింట్ వర్కింగ్ గ్రూప్ ఇక్కడ భేటీ అయింది. శుక్రవారంతో ముగిసిన ఈ సమావేశంలో ఇరు దేశాలు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థల నుంచి పొంచి ఉన్న ముప్పుపై తమ అభిప్రాయాలను పరస్పరం పంచుకున్నాయి. అమెరికా ప్రతినిధి బృందానికి ఆ దేశ విదేశాంగ శాఖ కౌంటర్-టెర్రరిజం సమన్వయకర్త, రాయబారి నాథన్ సేల్స్ నేతృత్వం వహించారు. భారత ప్రతినిధి బృందానికి విదేశీ వ్యవహారాల శాఖ సంయుక్త కార్యదర్శి మహావీర్ సింఘ్వీ నాయకత్వం వహించారు.