అంతర్జాతీయం

చైనాలో వర్ష బీభత్సం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, జూలై 21: భారీ వర్షాలు చైనాను కుదిపేస్తున్నాయి. ఈ వర్షాల ధాటికి వందమందికి పైగా మృతి చెందడమో, గల్లంతు కావడమో జరిగిందని అధికార వర్గాల సమాచారం. పదుల సంఖ్యలో ఇళ్లు కూలిపోవడంతో పాటు విద్యుత్ సరఫరా, ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. చైనా సెంట్రల్, ఉత్తర ప్రాంతాల్లో బుధవారం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 42మంది చనిపోగా 74మంది జాడ ఇప్పటివరకూ తెలియరాలేదని జిన్హువా న్యూస్ ఏజెన్సీ వెల్లడించింది. నెల రోజుల క్రితం కురిసిన వర్షాలకు 300మంది మరణించగా, వందమంది గల్లంతయ్యారు. తాజాగా మరోసారి భారీ వర్షాలు ముంచెత్తడంతో ఉత్తర చైనాలోని హెబెల్ ప్రావిన్స్‌లో 30మంది మృతిచెందగా, 68మంది జాడ తెలియరాలేదు. 1,63,900మందిని బలవంతంగా ఇళ్లను ఖాళీచేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. వరదలు, మట్టిపెళ్లలు విరిగిపడటంతో 47,713 ఇళ్లకు నష్టం వాటిల్లగా, 3,54,600 హెక్టార్లలో పంట దెబ్బతింది. ఈ ప్రాంతాల్లో సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బతింది. ఇప్పటివరకు కురిసిన వర్షాల వల్ల 711 మిలియన్ అమెరికా డాలర్ల మేర ఆర్థిక నష్టం వాటిల్లింది. హందాన్, జింగ్‌తాయ్, షిజియాజువాంగ్ ప్రాంతాల్లో వర్ష బాధితులకు టెంట్లు, బట్టలు, ఆహార పదార్థాలతో పాటు నిత్యావసరాలను సరఫరా చేస్తున్నారు. హెనాన్ ప్రావిన్స్‌లో 12మంది చనిపోగా, ఆరుగురి జాడ తెలియరాలేదని అధికారులు తెలిపారు.
వర్షాల వల్ల లక్షా ఐదువేల మంది నిరాశ్రయులయ్యారని, 2,110 నివాసాలను ఖాళీచేయించినట్లు పేర్కొన్నారు. 20,720 హెక్టార్లలో పంట నష్టం సంభవించింది. అధికార యంత్రాంగం సహాయ చర్యల్లో నిమగ్నమైంది. ప్రాణనష్టం సంభవించకుండా అవసరమైన చర్యలు చేపడుతున్నారు.