అంతర్జాతీయం

వచ్చేవారం సరిహద్దు మూసేస్తా..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పామ్‌బీచ్, మార్చి 30: మెక్సికో అధికారులు తక్షణమే అక్రమ వలసలను అరికట్టక పోతే తమ దేశంతో ఉన్న దక్షిణ సరిహద్దును వచ్చేవారం మూసేస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరించారు. ఈ నిర్ణయం వల్ల రెండు దేశాల ఆర్థిక వ్యవస్థలకూ నష్టం వాటిల్లే అవకాశం ఉన్నప్పటికీ పరిస్థితి మారక పోతే తాను వెనుకాడేది లేదని ఆయన స్పష్టం చేశారు. గత కొంత కాలంగా మెక్సికోతో అక్రమ వలసల సమస్యను అమెరికా ఎదుర్కొంటోంది. దీని కారణంగానే సరిహద్దు గోడను నిర్మించాలని ట్రంప్ పట్టుబట్టారు. ఇందుకు సంబంధించి చాలా స్పష్టమైన హెచ్చరికను ఆయన చేయడం ఇదే మొదటిసారి. దీర్ఘకాలం పాటు ఈ సరిహద్దును మూసేస్తారా అంటూ ఫ్లోరిడాలో విలేఖరులు అడిగిన ప్రశ్నకు ‘నేనేమీ సరదాగా చెప్పడం లేదు’అని ట్రంప్ జవాబిచ్చారు. మెక్సికోతో పూర్తిగా సరిహద్దును అమెరికా మూసేసే పక్షంలో ఇరు దేశాల మధ్య వర్తక వాణిజ్యాలకు తీవ్ర విఘాతమే ఏర్పడుతుంది.అమెరికా సూపర్ మార్కెట్‌లో విక్రయమయ్యే మెక్సికో ఉత్పత్తులన్నీ ఆగిపోతాయని అమెరికా వాణిజ్య మండలి చెబుతోంది.