అంతర్జాతీయం

పది రెట్లు శక్తివంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మార్చి 31: సూర్యుడు అయస్కాంత శక్తికి సంబంధించి ఇప్పటి వరకు ఖగోళ వేత్తలు ఎన్నో అధ్యయనాలు చేశారు. తాజాగా జరిగిన ఓ పరిశీలన గతంలో వచ్చిన అంచనాల అన్నింటికంటే భిన్నమైన వివరాలనే సూర్యుడికి సంబంధించి వెలుగులోకి తెచ్చింది. తాజా అంచనాల ప్రకారం సూర్యుడు అయస్కాంత శక్తి పది రెట్లు బలమైనదేనని స్పష్టమవుతోంది. ఈ లెక్కల ప్రకారం సౌర వాతావరణానికి సంబంధించిన అవగాహనలోనూ, భూమిపై దీని ప్రభావం విషయంలోనూ అంచనాలు మారిపోయే అవకాశం ఉంది. 2017 సెప్టెంబర్ 10న సూర్యుడుకి సంబంధించిన ఓ ప్రత్యేక పరిణామాన్ని అధ్యయనం చేసిన యూనైటెడ్ కింగ్‌డమ్‌లోని ఓ యూనివర్శిటీ ఈ తాజా వివరాలను వెలుగులోకి తెచ్చింది. సూర్యుడు అయస్కాంత శక్తి విషయంలో ఇప్పటి వరకు వచ్చిన అంచనాలు సరైనవి కావని, వీటి కంటే పదిరెట్లు ఎక్కువ శక్తి ఈ అయస్కాంత క్షేత్రానికి ఉందని డెవిడ్ కురిజే అనే పరిశోధకుడు స్పష్టం చేశాడు. సూర్యుడి ఆవలి వాతావరణంలో జరిగే ప్రతి పరిణామంపైనా దాని అయస్కాంత క్షేత్ర ప్రభావం ఎంతో ఉంటుందని ఈ అధ్యయనంలో పాల్గొన్న ఇతర పరిశోధకులు స్పష్టం చేశారు.