అంతర్జాతీయం

నేపాల్‌ను వణికించిన తుపాను

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, ఏప్రిల్ 1: దక్షిణ నేపాల్‌లో ఆదివారం సంభవించిన భీకర తుపాను జనజీవనాన్ని అతలాకుతలం చేసింది. భారీ తుపాను తాకిడి వల్ల 29 మంది దుర్మరణం చెందారు. దాదాపు 600 మంది గాయపడ్డారు. తుపాను ప్రభావం వల్ల ప్రచండ వేగంతో వీచిన గాలులకుతోడు వడగళ్ల వానతో ఎన్నో ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది వాహనాలు దెబ్బతిన్నాయి. లెక్కకుమించిన చెట్లు విరిగిపడ్డాయి. పలుచోట్ల విద్యుత్ స్తంభా లు నేలకూలాయి. బారాతోపాటు దానికి ఆనుకున్న పర్సా ప్రాంతంలో ఆదివారం సాయంత్రం వచ్చిన భయంకరమైన తుపానుతో ఇటు బలమైన గాలులు వీచడంతోపాటు మరోపక్క కుండపోత వర్షం పడింది. దక్షిణ ఖాట్మాండుకు 128 కిలోమీటర్ల దూరంలోని బారా ప్రాంతంలో సంభవించిన తుపాను వల్ల 26 మంది పౌరులు మరణించినట్టు అధికార వర్గాలు పేర్కొన్నాయి. పర్సా ప్రాంతంలో సైతం ఒక వ్యక్తి మరణించినట్టు ఆ వర్గాలు తెలిపాయి. అతి భయంకరంగా వీచిన గాలుల తాకిడికి రోడ్డుపై వెళ్తున్న కార్లు బోల్తాపడ్డాయి. హైవేపై వెళున్న ఒక బస్సులో ఒక ప్రయాణికుడు కింద పడి మరణించాడు. పోలీసుల కథనం ప్రకారం...ప్రచండ వేగంతో వీచిన తుపాను తాకిడి ప్రభావంతో ఎంతోమంది మరణించారని, లెక్కకుమించిన జనం క్షతగాత్రులయ్యారని తెలుస్తోంది. ఎన్నో ఇల్ళు నేలమట్టమయ్యాయి. చాలా ఇళ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. పలుచోట్ల చెట్లు నేలకూలడంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. ప్రొవిన్స్-2 అటార్నీ జనరల్ దీపేంద్ర ఝా కథనం ప్రకారం..బారా పెహతా రూరల్ మున్సిపాలిటీ పరిధిలోని పెహతా, భులాహి భర్వాలియా తదితర ప్రాంతాల్లో తుపాను, భారీ వర్షం తాకిడికి దాదాపు 600 మందికి పైగా గాయపడ్డారు. ఆయా ప్రాంతాల్లో వడగళ్ల వల్ల జనంతోపాటు ఇళ్లకు, వాహనాలకు భారీగా నష్టం వాటిల్లిందని పేర్కొన్నారు. ప్రతి ఏడాది వర్షాకాలం సమయంలో కొండచరియలు విరిగిపడడం, వరదలు కారణంగా వందలాది మంది మరణించడం నేపాల్‌లో సహజమే. కానీ తుపాను కారణంగా సంభవించే భారీ వర్షాలతో వందలాది మంది గాయపడడం చాలా అరుదు. ఇదిలావుండగా, తుపాను, వడగళ్ల ప్రభాంతో తీవ్రంగా గాయపడినవారిని చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించినట్టు పర్సా జిల్లా పోలీస్ కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి. నేపాల్ ఆర్మీ, నేపాల్ పోలీస్, ఆర్మ్‌డ్ పోలీస్ సిబ్బంది తుపాను దెబ్బతిన్న ప్రాంతాల్లో సహాయచర్యల్లో నిమగ్నమయ్యారని బారా చీఫ్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ రాజేష్ పౌడెల్ తెలిపారు. తుపాను కారణంగా మరణించిన కుటుంబాలకు 3 లక్షల రూపాయల వంతున నష్టపరిహారం అందించనున్నట్టు ఆయన పేర్కొన్నారు. తక్షణ సహాయం కింద టెంట్లు, ఆహార పదార్థాలు, మందులు అందజేస్తున్నట్టు తెలిపారు.
చిత్రం.. నేపాల్‌లోని బారా ప్రాంతంలో పెను తుపానుకు శిథిలమైన ఓ గ్రామం