అంతర్జాతీయం

మమ్మల్ని ఆదుకోండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, ఏప్రిల్ 17: సంప్రదాయ ఇస్లామిక్ విధానాలను వ్యతిరేకిస్తూ దేశం విడిచి పారిపోయి జార్జియాకు చేరుకున్న ఇద్దరు సౌదీ అరేబియా అక్కాచెల్లెల్లు తమను ఆదుకోవాలని సోషల్ మీడియా వేదికగా అభ్యర్థిస్తున్నారు. ఒకప్పటి సోవియట్ యూనియన్‌లో భాగమైన జార్జియాకు చేరుకున్న మహాఅల్ సుబేయ్ (28), వహాఅల్ సుబేయ్ (25) సోషల్ మీడియాలో తమ పాస్‌పోర్టు ఇతర ధృవీకరణ పత్రాలు చూపిస్తూ పోస్ట్ చేసిన వీడియా వైరల్‌గా మారింది. తమను జార్జియా నుంచి బలవంతంగా సౌదీగా తీసుకెళ్లి హతమార్చే ప్రమాదముందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమ తండ్రి, సోదరుడు ఇప్పటికే జార్జియా చేరుకున్నారని, వారు ఏ క్షణంలోనైనా తమను పట్టుకోవడం లేదా హతమార్చడం చోటు చేసుకోవచ్చునని అన్నారు. కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమవుతున్న అణచివేత, లైంగిక వేధింపులే తాము జార్జియా చేరుకునేందుకు ప్రధాన కారణమని వారు అన్నారు. సౌదీలో మానవ హక్కుల ఉల్లంఘన రోజురోజుకూ పెరుగుతున్నదని ఆరోపించారు. మహిళలు దుర్భర జీవితం గడుపుతున్నారని మతం పేరుతో వేధింపులు జరుగుతున్నాయని ఆరోపించారు. తమకు రక్షణ కల్పించాలని వారు వేడుకున్నారు.