అంతర్జాతీయం

14 మందిని కాల్చి చంపారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్/ కరాచి, ఏప్రిల్ 18: పాకిస్తాన్‌లో గుర్తు తెలియని సాయుధ దుండగులు పారామిలిటరీ సైనికుల దుస్తులు ధరించి గురువారం మారణకాండకు ఒడిగట్టారు. బస్సుల్లో ప్రయాణిస్తున్న పాకిస్తాన్ నేవీ సిబ్బంది సహా మొత్తం 14 మంది ప్రయాణికులను కిందికి దింపి కాల్చిచంపారు. బాలోచిస్తాన్ ప్రావిన్స్‌లోని ఒక హైవేపై బస్సుల్లో వెళ్తుండగా, వారిని బస్సుల్లోనుంచి కిందికి దింపి కాల్చిచంపారు. 15 నుంచి 20 మంది వరకు ఉన్న సాయుధ దుండగులు కరాచి- గ్వాడార్ మధ్య నడుస్తున్న అయిదారు బస్సులను నిలిపివేశారు. బాలోచిస్తాన్‌లోని ఓర్మర ప్రాంతంలో మాక్రాన్ కోస్టల్ హైవేపై బస్సులను నిలిపివేసిన దుండగులు, ఆ బస్సుల్లో ప్రయాణిస్తున్న సుమారు మూడు డజన్ల మంది ప్రయాణికుల గుర్తింపు కార్డులను తనిఖీ చేశారు. అనంతరం అందులోని 16 మందిని బస్సుల్లో నుంచి కిందికి దింపారని పోలీసులు తెలిపారు. 16 మందిని బస్సుల్లో నుంచి దింపినప్పటికీ, 14 మందిని తరువాత కాల్చి చంపారు. మరో ఇద్దరు చాకచక్యంగా తప్పించుకోగలిగారని బాలోచిస్తాన్ పోలీసు ఇన్‌స్పెక్టర్ జనరల్ (ఐజీ) మొహ్‌సిన్ హసన్ బట్ తెలిపారు. పారామిలిటరీ సైనికులు సాధారణంగా హైవేపై బస్సులను తనిఖీ చేస్తుంటారని, సాయుధ దుండగులు వారు వేసుకునే యూనిఫామ్‌లు ధరించి వచ్చి దాడికి దిగారని బాలోచిస్తాన్ హోంమంత్రి జియా లాంగోవ్ మీడియాకు చెప్పారు. దాడికి దిగిన దుండగులను గుర్తించి, అరెస్టు చేయడానికి తాము దర్యాప్తు ప్రారంభించామని ఆయన తెలిపారు. మృతులను ఇంకా గుర్తించలేదని ఆయన చెప్పారు. అయితే ‘మృతుల్లో ఒక నేవీ, ఒక కోస్ట్ గార్డ్ సిబ్బంది ఉన్నారు’ అని లాంగోవ్ చెప్పారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఇమ్రాన్ ఖాన్ ఈ దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ సంఘటనపై నివేదిక ఇవ్వాల్సిందిగా అధికారులను ఆదేశించారు. ఈ అమానుష మారణకాండకు దిగిన దుండగులను గుర్తించి, న్యాయస్థానం ముందు నిలబెట్టడానికి వీలయిన ప్రతి చర్య తీసుకోవాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇమ్రాన్ ఖాన్ మృతులకు తీవ్ర సంతాపాన్ని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ కూడా ఈ ఘటనను పిరికిపందల చర్యగా అభివర్ణిస్తూ ఖండించారు. బాలోచిస్తాన్ ముఖ్యమంత్రి జామ్ కమాల్ కూడా ఈ దాడిని తీవ్రంగా ఖండించారు.
ఫైల్ ఫొటో