అంతర్జాతీయం

ఊహన్ తరహా చర్చలకు సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, ఏప్రిల్ 19: భారత్‌తో ద్వైపాక్షిక సంబంధాలను పెంపొదించుకునేందుకు ఊహన్ తరహాలో శిఖరాగ్ర చర్చలు జరిపేందుకు తాము సిద్ధంగా ఉన్నామని చైనా ప్రకటించింది. త్రిలియన్ల కొద్దీ డాలర్ల వ్యయంతో నిర్మిస్తున్న పాకిస్థాన్ చైనా ఎకనామిక్ కారిడార్ విషయంలో భారత్‌తో విబేధాలు ఉన్నప్పటికీ ద్వైపాక్షిక సంబంధాలను పెంపొదించుకోవడానికి తాము సుముఖంగా ఉన్నామని చైనా విదేశాంగ మంత్రి వాంగ్‌ఈ తెలిపారు. ఈ ఎకనామిక్ కారిడార్‌కు సంబంధించి భారత్ తన వ్యతిరేకతను విడనాడాలని ఆయన అభ్యర్థించారు. దీని వల్ల కాశ్మీర్ విషయంలో తమ వౌలిక అభిప్రాయంలో ఎలాంటి తేడా ఉండదని స్పష్టం చేశారు. బెల్ట్ అండ్ రోడ్డు ప్రాజెక్టును భారత్ వ్యతిరేకించడం వల్ల ఈ రెండు దేశాల మధ్య ఇటీవల ఏర్పడిన సానుకూల బంధానికి విఘాతం ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీజిన్‌పింగ్ మధ్య జరిగిన గుణాత్మక చర్చలను ఆయన ఈ సందర్భంగా ప్రస్తావించారు. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలంగా ముందుకు తీసుకెళ్ళేందుకు అవసరమైన పునాదులను కూడా చర్చల ద్వారా మోదీ, జీజిన్‌పింగ్‌లు పునాదులు వేశారని ఆయన తెలిపారు.