అంతర్జాతీయం

290కి పెరిగిన మృతుల సంఖ్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 22: శ్రీలంక రాజధాని కొలంబోలో బయోత్పాతం సృష్టించిన ఉగ్రదాడులకు సంబంధించి కీలక వివరాలను అధికారులు వెలుగులోకి తెచ్చారు. ఈ దాడిలో ఓ ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థకు చెందిన ఏడుగురు ఆత్మాహుతి బాంబర్లు పాల్గొని వరుస పేలుళ్లు సృష్టించి 290 మందిని బలిగొన్నారని సోమవారం వెల్లడించారు. దేశాధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన సారథ్యంలో జరిగిన జాతీయ భద్రతా మండలి దేశంలో ఏమర్జెన్సీ విధించాలని నిర్ణయించింది. కాగా, ఈ ఘాతుకానికి తామే పాల్పడ్డామని ఏ ఉగ్రవాద సంస్థ ప్రకటించనప్పటికీ పోలీసులు ఇప్పటి వరకు 24 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు. వీరంతా కూడా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్న ఈ ఇస్లామిక్ తీవ్రవాద సంస్థకు చెందిన వారేనని చెబుతున్నారు. ఈ దాడిలో మరణించిన భారతీయుల సంఖ్య ఆరుకు పెరిగిందని వెల్లడించారు. అరెస్టయిన 24 మందిలో 9 మందిని మే 6వ తేదీ వరకు రిమాండ్‌కు పంపాలని కొలంబో మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. కాగా, 3 క్రైస్తవ ప్రార్థనా స్థలాలు, హోటళ్లపై జరిగిన దాడికి స్థానికంగా ఉన్న జాతీయ తహీద్ జమాత్ (ఎన్‌టీజే) ప్రమేయం ఉన్నట్టు భావిస్తున్నట్టు తెలిపారు. ఈ ఆత్మాహుతి బాంబర్లు అందరూ కూడా శ్రీలంక జాతీయులేనని దేశ ఆరోగ్యమంత్రి, ప్రభుత్వ ప్రతినిధి అయిన సేనరత్నే తెలిపారు. సోమవారం ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన ఈ స్థానిక మిలిటెంట్ సంస్థకు అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయన్న విషయాన్ని నిగ్గుతేలుస్తున్నామన్నారు. షాంగ్రీలా, కింగ్స్‌బరి, సినామన్, గ్రాండ్ హోటల్స్‌తో పాటు మూడు చర్చిల్లో జరిగిన పేలుళ్లకు ఆత్మాహుతి దాడులే కారణమన్నారు. మొత్తం ఏడు ఆత్మాహుతి దాడులు జరిగినట్టుగా తాము సేకరించిన ఆధారాలను బట్టి స్పష్టమవుతుందన్నారు. అరెస్టయిన 24 మందిని అనేక కోణాల్లో ప్రశ్నిస్తున్నామని, వీరిని సీఐడీ విభాగానికి అప్పగించామని పోలీసు ప్రతినిధి గుణశేఖర తెలిపారు. ఉగ్రవాదాన్ని నిరోధించడమే లక్ష్యంగా అనేక చర్యలు చేపడతామని, భావ ప్రకటన స్వేచ్ఛకు ఎలాంటి అవరోధం కలగకుండా చూస్తామన్నారు. ప్రజా భద్రత కోసమే షరతులతో కూడాని ఎవర్జన్సీని విధించడం జరిగిందని తెలిపారు. కాగా, మంగళవారం జాతీయ సంతాప దినంగా పాటిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
మరోపక్క పేలుళ్లపై దర్యాప్తు జరిపేందుకు దేశాధ్యక్షుడు సిరిసేన ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేశారు. రెండు వారాల్లో నివేదిక అందించాలని ఈ కమిటీని ఆదేశించారు. కాగా, పేలుళ్లను ఖండించిన రెండు శ్రీలంక ముస్లిం సంస్థలు కుట్రదారులను పట్టుకొని కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కాగా, సెంట్రల్ కొలంబో బస్‌స్టేషన్‌లో 87 బాంబు డిటోనేటర్లను పోలీసులు గుర్తించారు. పేలుళ్లకు మూడు నెలల ముందే బాంబర్లు ఓ సురక్షిత స్థావరంలో ఉన్నారని, శ్రీలంక శివారులోని పనాదురాలో ఉన్న ఈ ఇంటిని గుర్తించామని పోలీసులు తెలిపారు.
చిత్రాలు.. శ్రీలంక పేలుళ్ల మృతుల బంధువుల రోదనలు