అంతర్జాతీయం

జపాన్ అసెంబ్లీకి ఎన్నికైన తొలి భారతీయుడు యోగి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టోక్యో, ఏప్రిల్ 23: టోక్యోలోని ఎడొగవా వార్డు అసెంబ్లీకి భారతీయుడు ‘యోగి’ అత్యధిక మెజారిటీతో ఎన్నికయ్యారు. ఈ నెల 21న జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో ఎడొగవా వార్డు అసెంబ్లీ స్థానానికి పూర్ణిక్ యోగేంద్ర (యోగి) ఎన్నికయ్యారు. యోగికి 6,477 (అంటే 226.561 విలువ గల) ఓట్లు పొందారు. జపాన్‌లో జరిగిన ఎన్నికల్లో భారతీయుడు ఎన్నిక కావడం ఇదే ప్రథమం. టోక్యోలోని 23 వార్డుల్లో 4,300 మంది భారతీయులు ఉన్నారు. మొత్తం జపాన్‌లో 34 వేల మంది భారతీయులు ఉన్నారు. యోగి ఎన్నికైన ఎడగవా వార్డులో చైనా, కొరియ, మన దేశానికి చెందిన ఓటర్లు ఉన్నారు. జపాన్-్భరత్‌ల మధ్య మైత్రి బంధం మరింత ధృడంగా ఉండేందుకు ఈ ఎన్నిక ఉపయోగపడుతుందని, జపాన్‌కు ఇతర దేశాలకు మధ్య తాను వారథిగా ఉంటానని యోగి తెలిపారు. యోగి 1997 సంవత్సరంలో విద్యనభ్యసించడానికి విశ్వవిద్యాలయంలో చేరారు. రెండేళ్ళ అనంతరం భారత్‌కు చేరుకుని, ఆ తర్వాత మళ్లీ 2001లో జపాన్‌కు చేరుకుని ఇంజనీర్‌గా ఉద్యోగం సంపాదించారు. ఆ తర్వాత బ్యాంకు, ఇతర కంపెనీల్లో ఉద్యోగం చేస్తూ 2005లో ఎడొగవా వార్డులో 2005 సంవత్సరంలో స్థిరపడ్డారు.