అంతర్జాతీయం

‘క్రైస్ట్‌చర్చ్ దాడి’కి ప్రతీకారమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, ఏప్రిల్ 23: న్యూజిలాండ్‌లోని క్రైస్ట్‌చర్చ్‌లో మార్చి 15న రెండు మసీదుల్లో ఓ దుండగుడు విచక్షణారహితంగా జరిపిన కాల్పులకు ప్రతీకారంగా శ్రీలంకలో ఈస్టర్ సండే రోజున స్థానిక ఇస్లామిక్ తీవ్రవాదులు ఆత్మాహుతి దాడులకు పాల్పడ్డారని శ్రీలంక రక్షణ శాఖ సహాయ మంత్రి రువాన్ విజెవర్దెనే మంగళవారం శ్రీలంక పార్లమెంటుకు తెలిపారు. ఈస్టర్ సండే నాటి ఆత్మాహుతి దాడులపై దర్యాప్తు కొనసాగుతోందని, స్థానిక ఇస్లామిక్ తీవ్రవాదులు ప్రతీకార చర్యలో భాగంగా ఈ దాడులకు పాల్పడినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని ఆయన వివరించారు. ఆత్మాహుతి దాడులపై చర్చించేందుకు శ్రీలంక పార్లమెంటు మంగళవారం అత్యవసరంగా భేటీ అయింది. ఇదిలా ఉండగా, శ్రీలంక వ్యాప్తంగా ప్రజలు మంగళవారం ఉదయం ఆత్మాహుతి దాడుల్లో అసువులు బాసిన బాధితులకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్రీలంక ప్రభుత్వం మంగళవారం జాతీయ సంతాప దినంగా పాటించాలని నిర్ణయించడంతో ప్రజలు ఎక్కడికక్కడ మూడు నిమిషాల పాటు వౌనం పాటించి మృతులకు నివాళులు అర్పించారు. శ్రీలంక జాతీయ పతాకాలను అవనతం చేశారు. ఆత్మాహుతి దాడుల్లో పది మంది భారతీయులు సహా 310 మంది మృతి చెందారు. మరోవైపు, వరుస ఆత్మాహుతి దాడుల కారణంగా శ్రీలంకలో మంగళవారం అత్యయిక పరిస్థితి అమలులోకి వచ్చింది. శ్రీలంక అధ్యక్షుడు లంక సైన్యానికి యుద్ధ సమయాల్లో సంక్రమించే అధికారాలన్నింటినీ ఇచ్చారు. అనుమానితులను అదుపులోకి తీసుకునే, అరెస్టు చేసే అధికారాలు కూడా సైన్యానికి ఇచ్చారు. ఇంకోవైపు, వివిధ విభాగాల పోలీసులు 40మంది అనుమానితులను అరెస్టు చేశారు. ఆత్మాహుతి బాంబర్లు ఉపయోగించినట్టు భావిస్తున్న ఒక వ్యాన్ డ్రైవర్ కూడా అరెస్టయిన వారిలో ఉన్నాడు. ప్రభుత్వం కొన్ని సామాజిక మాధ్యమాలను నిలిపివేసింది. శ్రీలంక రాజధాని కొలంబోలోని ప్రధాన వీధుల్లో సైనిక బలగాలు మంగళవారం కవాతు నిర్వహించాయి.
క్రైస్ట్‌చర్చ్‌లోని మసీదుల్లో మారణకాండ తరువాత ఆ ఘటనకు శ్రీలంకను నిందిస్తూ స్థానిక ఇస్లామిక్ తీవ్రవాద సంస్థ సభ్యుడు ఒకరు సోషల్ మీడియాలో తీవ్రవాద అంశాలతో కూడిన పోస్ట్ పెట్టాడని కొందరు ప్రభుత్వాధికారులకు అందిన ఇంటెలిజెన్స్ మెమో వెల్లడించిందని విజెవర్దెనే మంగళవారం శ్రీలంక పార్లమెంటుకు వెల్లడించారు. ఈస్టర్ సండే రోజు జరిగిన ఏడు ఆత్మాహుతి దాడులకు నేషనల్ తౌఫీక్ జమాత్ (ఎన్‌టీజే) కారణమని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. ఆత్మాహుతి బాంబర్లు అందరూ శ్రీలంక జాతీయులేనని, అయితే ఎన్‌టీజేకు విదేశీ ఉగ్రవాద నెట్‌వర్క్‌లతో సంబంధం ఉందని తెలిపింది. ఆత్మాహుతి దాడుల్లో మృతుల సంఖ్య 321కి పెరిగిందని విజెవర్దెనే పార్లమెంటుకు తెలిపారు. వీరిలో 38 మంది విదేశీయులు ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వీరిలో పది మంది భారతీయులు ఉన్నారు.
శ్రీలంక ప్రధానమంత్రి రనిల్ విక్రమసింఘే పార్లమెంటులో మాట్లాడుతూ ‘ప్రపంచ ఉగ్రవాదం శ్రీలంకకు చేరింది’ అని అన్నారు. ముస్లిం సమాజం కూడా ఈ దాడులకు వ్యతిరేకమని అన్నారు. కేవలం కొద్ది మంది ముస్లింలు మాత్రమే ఈ దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రజలకు రక్షణ కల్పించడంలో విఫలమయిందని ప్రతిపక్ష నాయకుడు మహిందా రాజపక్సే నిందించారు. ప్రజలకు రక్షణ కల్పించలేకపోతే ప్రభుత్వం వెంటనే దిగిపోవాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆత్మాహుతి దాడుల్లో ముస్లిం సోదరులు
రెండు విలాసవంతమయిన హోటళ్లలో ఆత్మాహుతి దాడులకు పాల్పడింది స్థానిక ముస్లిం సోదరులేనని పోలీసు వర్గాలు తెలిపాయి. వీరిద్దరు కొలంబోలోని ఒక సంపన్నుడయిన వర్తకుడి కుమారులని పేర్కొన్నాయి. షాంగ్రి-లా, సిన్నమోన్ గ్రాండ్ హోటళ్లలో అతిథులు అల్పాహారం చేయడానికి వరుస క్రమంలో నిలబడి ఉన్న సమయంలో వీరిద్దరు తమను తాము పేల్చుకున్నారని వివరించాయి. వీరిద్దరు ఎన్‌టీజేలో కీలక సభ్యులని పేర్కొన్నాయి. వారి పేర్లను వెల్లడించలేదు.