అంతర్జాతీయం

దక్షిణాఫ్రికాలో ముంచెత్తిన వరదలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జోహెన్స్‌బర్గ్, ఏప్రిల్ 24: దక్షిణాఫ్రికా దేశంలో వరదలు ముంచెత్తడంతో 51 మంది మృతి చెందారు. దీంతో అధ్యక్షుడు సిరిల్ రాంపోశ బాధిత ప్రాంతాల సందర్శనకు బయలుదేరారు. గత వారం రోజులుగా దేశంలోని దక్షిణ, తూర్పు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. వరదలు పలు ప్రాంతాలను ముంచెత్తడంతో భారీ ప్రాణనష్టం జరిగిందని అధికారులు తెలిపారు. వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన, ఆస్తి నష్టపోయిన వారికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్టు అధ్యక్షుడు సిరిల్ ఒక ప్రకటనలో తెలిపారు. కాగా వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. విరిగిపడ్డ కొండచరియల తొలగింపు, వరదల వల్ల పేరుకుపోయిన చెత్త తొలగింపు, వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించడం వంటి కార్యక్రమాలు ముమ్మరంగా సాగిస్తోంది. వరద మృతుల సంఖ్య మంగళవారం నాటికి 31 ఉండగా, బుధవారం నాటికి ఇది 51కు చేరుకుంది. పలుచోట్ల భవనాలు కుప్పకూలగా, విద్యుత్ స్తంభాలు, చెట్లు రోడ్లపై పడిపోవడంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. కాగా, రానున్న కొద్దిగంటల్లో మరింత భారీ వర్షాలు, ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది. వరదల వల్ల ప్రతి సంవత్సరం ముంపునకు గురవుతున్న లోతట్టు ప్రాంతాల వారిని శాశ్వతంగా ఖాళీ చేయించడానికి గత ఏడాది ప్రయత్నించామని, ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం పొందడానికి వారితో చర్చలు జరుపుతున్నామని ఆ దేశ మంత్రి నోముస దూబె తెలిపారు.