అంతర్జాతీయం

చేతులు కలిపిన పుతిన్, కిమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వ్లాదివోస్తాక్, ఏప్రిల్ 25: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గురువారం ఇక్కడ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ అయ్యారు. అణ్వాయుధాల వ్యాప్తి విషయంలో అమెరికాతో నిత్యం ఘర్షణ వైఖరితో ఉండే కిమ్ రష్యా అధినేతతో ముఖాముఖి కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. గురువారం ఇక్కడకు వచ్చిన కిమ్‌కు పుతిన్ సాధరంగా స్వాగతం పలికారు. ఇద్దరు దేశాధినేతలు తొలిసారి ముఖాముఖి సమావేశం అయ్యారు. కిమ్, పుతిన్ చేయిచేయి కలిపి చిరునవ్వులు చిందించారు. ఇద్దరి మధ్య సుమారు రెండు గంటల సేపు సుదీర్ఘంగా చర్చలు నడిచాయి. పసిఫిక్ తీర నగరం వ్లాదివోస్తాక్‌లో జరిగిన ఈ సమావేశంలో అనేక కీలక అంశాలు చర్చకు వచ్చినట్టు తెలిసింది. సమావేశానికి ముందే ఇరుదేశాధినేతలు ఓ సంయుక్త ప్రకటన చేశారు. వ్లాదివోస్తాక్‌ను బుధవారమే కిమ్ చేరుకున్నారు. గురువారం పుతిన్ చేరుకున్నారు. తొలుత ఇద్దరూ కరచాలనం, పలకరింపులు చేసుకున్నాక చర్చలకు ఉపక్రమించారు. కొరియా ద్వీపకల్పంలో శాంతిని నెలకొల్పడానికి రష్యా అన్ని విధాలా సహాయ, సహకారాలు అందిస్తుందని పుతిన్ వెల్లడించారు. ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు, కిమ్ తాతగారు కిమ్ 2 సంగ్‌తో సోవియట్ యూనియన్‌కు ఉన్న సంబంధాలను రష్యా అధ్యక్షుడు ఈ సందర్భంగా ప్రస్తావించారు. కిమ్ నాయకత్వంలో తమ ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం కావాలని ఆకాంక్షిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. కిమ్ పర్యటన ఆర్థిక, ద్వైపాక్షిక సంబంధాలు బలోపేతానికి దోహపడతాయని పుతిన్ స్పష్టం చేశారు. అలాగే పుతిన్‌తో జరిగింది ఓ మంచి భేటీగా ఉత్తర కొరియా సారధి కిమ్ అభివర్ణించారు.‘అనేక అంశాలపై ఇరువురం అర్థవంతమైన చర్చలు జరిపాం. పరస్పర ప్రయోజం కలిగే దిశగా ముఖాముఖి సాగింది’అని కిమ్ వెల్లడించారు. ప్రపంచంలో అగ్రరాజ్యాల్లో ఒకటైన రష్యాలో కిమ్ పర్యటించడం సాధారణ విషయం కాదని విశే్లషకులు పేర్కొన్నారు. హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, కిమ్ మధ్య జరిగిన చర్చలు విఫలమైన తరువాత పుతిన్‌తో ముఖాముఖి భేటీ జరపడం గమనార్హం. అనేక ప్రధాన సమస్యలపై పుతిన్‌తో చర్చించి ఓ పరిష్కారం కనుగొనాలన్న ఉద్దేశంతోనే కిమ్ ఇక్కడకు వచ్చారు. రష్యాలో పనిచేస్తున్న పది వేల మంది ఉత్తర కొరియా కార్మికులకు సంబంధించి అంశంపై కిమ్ చర్చించారు. ఉత్తర కొరియా కార్మికుల ఒప్పందం ఈఏడాది చివరినాకికి ముగియనున్న దృష్ట్యా పుతిన్‌తో భేటీకి ఆసక్తి చూపారు. కార్మికుల ద్వారా ఉత్తర కొరియా విదేశీ మారక ద్రవ్యం ఆర్జిస్తోంది. కార్మిక శక్తి దేశానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉంది. గడువుముగిసినా తమ కార్మికులను కొనసాగించాలని కిమ్ రష్యా అధినేను కోరినట్టు పోంగ్యాంగ్ వర్గాలు వెల్లడించాయి. దేశంలో ఆహార కొరత తీర్చడానికి కిమ్ పర్యటన దోహదపడుతుందన్న ఆ వర్గాలు సహాయం కొనసాగించాల్సిందిగా మాస్కోను కోరారని పేర్కొన్నారు. ఉత్తర కొరియాకు 25 మిలియన్ అమెరికా డాలర్ల ఆహార పదార్థాలను రష్యా సమకూర్చుతోంది. మార్చి నెలలో 2000 మెట్రిక్ టన్లు గోధుమలను ఉత్తర కొరియాకు పంపినట్టు టాస్ వార్తా సంస్థ వెల్లడించింది. అమెరికా మితిమిరిన జోక్యానికి అడ్డుకట్టవేయాలని చూస్తున్న రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు కిమ్‌తో సమావేశం మంచి అవకాశం కల్పించినట్టయింది. ప్రపంచంపై పెత్తనం చేయాలని కొన్ని దేశాలు ప్రయత్నిస్తున్నాయని పుతిన్ తీవ్ర స్వరంతో హెచ్చరించినట్టు చైనా అధికార పత్రిక పీపుల్స్ డైలీలో వెల్లడించింది.