అంతర్జాతీయం

ముగ్గురు చైనా పాత్రికేయుల బహిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ, జూలై 23:ముగ్గురు చైనా పాత్రికేయులను భారత్ బహిష్కరించింది. చైనా అధికార వార్తా సంస్థ జిన్హువాలో పనిచేస్తున్న వూ కియాంగ్, లూ టాంగ్, షియాంగాంగ్‌ల వీసాలను పొడిగించడానికి భారత్ నిరాకరించింది. ఇప్పటికే ఇరు దేశాల సంబంధాలు వివాదాస్పదమైన నేపథ్యంలో ఈ తాజా నిర్ణయం వల్ల పరిస్థితులు మరింత సంక్లిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. ఢిల్లీ, ముంబయిల్లో పనిచేస్తున్న ఈ ముగ్గురి వీసాలను పొడిగించక పోవడానికి కారణమేమిటో తెలియలేదు. ఈ నెల 31లోగా భారత్‌ను వదిలి వెళ్లాలని ఇటీవలే ఈ ముగ్గురిని ప్రభుత్వం ఆదేశించింది. వీరిలో వూ కియాంగ్ గత ఏడేళ్లుగా భారత్‌లో పనిచేస్తున్నారు. మిగిలిన ఇద్దరు గత ఏడాదే చేరారు. ఆయా దేశాల అధికారిక విధానాలకు విరుద్ధంగా విదేశీ పాత్రికేయుల రాతలు ఉంటే అలాంటి వారి వీసాలను పునరుద్ధరించక పోవడం అన్నది పరిపాటి.