అంతర్జాతీయం

లంకలో భీకర పోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీలంక: శ్రీ లంకలో మానవ బాంబర్ల పేలుళ్ళ మంటలు ఆరక ముందే శనివారం ఇస్లామిక్ రహస్య స్థావరంపై భద్రతా బలగాలు ముప్పెట దాడి చేశాయి. అయితే ఆత్మాహుతి మానవ బాంబర్లు తమకు తాము పేల్చేసుకోవడంతో ఆరుగురు చిన్నారులతో పాటు ముగ్గురు మహిళలతో సహ 15 మంది మృత్యువాతపడ్డారు. ఏప్రిల్ 21న ఈస్టర్ సండే సందర్భంగా చర్చితో పాటు వేర్వేరు ప్రాంతాల్లో ముష్కరులు జరిపిన దాడులతో 253 మంది సామాన్య ప్రజలు మరణించగా, సుమారు 500 మంది తీవ్రంగా గాయపడిన సంగతి తెలిసిందే. నేషనల్ తౌహిత్ జమాత్ (ఎన్‌టీజే) ఈ వరుస బాంబు పేలుళ్ళు జరిపినట్లు ప్రకటించింది. ఇలాఉండగా కొలంబోకు 360 కిలో మీటర్లకు దూరంలో కాలామునయ్ నగర ప్రాంతంలో ముష్కరులు ఉన్నట్లు రక్షణ బలగాలకు సమాచారం అందడంతో శుక్రవారం రాత్రి టాస్క్ పోర్సు, ఆర్మీ బలగాలు మెరుపు దాడి చేశాయి. భద్రతా బలగాలు కాల్పులు జరపడం ప్రారంభించడంతో నలుగురు ఆత్మాహుతి మానవ బాంబర్లు తమకు తాము పేల్చేసుకోవడంతో 15 మంది మరణించారు. వీరిలో ఆరుగురు పురుషులు, ముగ్గురు మహిళలు, ఆరుగురు చిన్నారులు మరణించినట్లు పోలీసులు ధృవీకరించారు. ఆత్మాహుతి మానవ బాంబర్లు అక్కడికక్కడే మరణించినట్లు పోలీసులు గుర్తించారు. సాయంతమూర్తు ప్రాంతంలో పోలీసులు, ఆర్మీతో కలిసి సంయుక్తంగా సెర్చ్ చేస్తుండగా తీవ్రవాదులు కాల్పులు జరపడం ప్రారంభించినట్లు పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. పెద్ద మొత్తంలో డిటోనేటర్లు, విస్పోటాలు చేసే మందుగుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నట్లు ఆయన చెప్పారు. ముస్లింలు అధిక సంఖ్యలో ఉండే కులమనై ప్రాంతంలో వెంటనే కర్ఫ్యూను విధించినట్లు పోలీసులు తెలిపారు. ఇలాఉండగా వెల్లవట్ట రైల్వే స్టేషన్ వద్ద పోలీసులు కిలో విస్పోటక సామాగ్రిని గుర్తించి స్వాధీనం
చిత్రం...శ్రీలంకలో శనివారం మిలిటెంట్లతో జరిగిన ఎదురుకాల్పుల అనంతరం ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకున్న భద్రతా దళాలు.