అంతర్జాతీయం

మూడోసారి బెయిల్ పిటిషన్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 1: ప్రముఖ వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ బెయిల్ కోసం మరోసారి బెయిల్‌కు ప్రయత్నాలు ప్రారంభించారు. ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై ఈనెల 8న యూకే కోర్టులో విచారణ చేపట్టనుంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ)కి ఒక మిలియన్ డాలర్ల మేరకు కుంభకోణానికి పాల్పడడం, మనీ ల్యాండరింగ్ కేసులను ఆయన ఎదుర్కొంటున్నారు. 48 ఏళ్ల నీరవ్ మోదీ సౌత్ వెస్ట్ లండన్‌లోని వాండ్స్‌వర్త్ జైలులో గత కొంతకాలంగా శిక్షను అనుభవిస్తున్నారు. ఇప్పటికే ఆయన రెండుసార్లు కోర్టులో బెయిల్ పిటిషన్లను దాఖలు చేయగా, కోర్టు వాటిని తోసిపుచ్చింది. ఈ ఏడాది మార్చి 19న నీరవ్ మోదీని లండన్ పోలీసులు అరెస్టు చేశారు. బెయిల్ కోసం రెండుసార్లు కోర్టును అభ్యర్థించినా తిరస్కరించడంతో మళ్లీ మూడోసారి ఈనెల 8న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టులో చీఫ్ మేజిస్ట్రేట్ ఎమ్మా అర్బుథనాట్ ఎదుట నీరవ్ మోదీ హాజరుకానున్నారు. ‘నీరవ్ మోదీ దాఖలు చేసిన బెయిల్ అభ్యర్థనపై ఈనెల 8న వెస్ట్‌మినిస్టర్ మేజిస్ట్రేట్స్ కోర్టు జడ్జి ఎమ్మా అర్బుథ్‌నాట్ విచారణ చేపడతారు’ అని క్రౌన్ ప్రాసిక్యూషన్ సర్వీస్ (సీపీఎస్) అధికార ప్రతినిధి, ఈ కేసుపై భారత్ తరఫున పర్యవేక్షిస్తున్న బారిస్టర్ నిక్ హీర్న్ తెలిపారు. ఫర్నివాల్ చాంబర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్న బారిస్టర్ నిక్ హీర్న్ భారత్ తరఫున వాదనలు వినిపిస్తుండగా, నీరవ్ మోదీ క్లేర్ మాంట్‌గోమెరీ ఆఫ్ మ్యాట్రిక్స్ ద్వారా తన వాదనలను కోర్టుకు విన్నవించనున్నారు. ఏప్రిల్ 26న ఇదే కేసుపై నీరవ్ మోదీ జడ్జి అర్బుథ్‌నాట్‌తో జైలు నుంచే వీడియో లింక్ ద్వారా తన వాదనలను వినిపించారు. అయితే, నీరవ్ మోదీ తరఫున బెయిల్ కోసం ఎవరూ దరఖాస్తు చేయకపోవడంతో ఈనెల 24వరకు అతనిని జ్యుడీషియల్ కస్టడీలోనే ఉంచాలని కోర్టు ఆదేశించింది. బెయిల్ కోసం గతంలో రెండుసార్లు నీరవ్ మోదీ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు తిరస్కరించిన విషయం తెలిసిందే.