అంతర్జాతీయం

వికీలిక్స్ వ్యవస్థాపకుడు అసాంజేకు జైలు ఖాయం!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 1: బ్రిటీష్ కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించిన వికీలీక్స్ వ్యవస్థాపకుడు జులియన్ అసాంజేకు జైలు శిక్ష పడే అవకాశం లేకపోలేదు. ఆస్ట్రేలియాకు చెందిన అసాంజే ఏప్రిల్ 12న అరెస్టు అయ్యారు. లైంగిక వేధింపులు, అత్యాచారం వంటి ఆరోపణల నేపథ్యంలో 2012 సంవత్సరంలో బ్రిటీష్ న్యాయమూర్తి ఆయనకు ఏడేళ్ళ క్రితం శిక్ష 12 నెలల జైలు శిక్ష విధించారు. తనపై ఉద్దేశపూర్వకంగానే నిరాధారమైన ఆరోపంలు చేశారని అసాంజే అప్పట్లో తెలిపారు. జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి అసాంజే స్వీడన్‌కు పారిపోయారు. ఇలాఉండగా 47 ఏళ్ళ అసాంజేను పోలీసులు నాటకీయ పద్ధతిలో లండన్ పోలీసులు అరెస్టు చేయగా, రాయబార పోలీసుల చర్యలకు వ్యతిరేకంగా ఆయన నినాదాలు చేశారు. పోలీసులు అసాంజేను కోర్టు ముందు హాజరుపరిచారు. అసాంజేకు శిక్ష పడడం ఖాయమని న్యాయవాదులు అంటున్నారు. వికీలీక్స్ సైట్‌లో యుఎస్ సైనిక ఇంటెలిజెన్స్ సమాచారాన్ని, దేశ రక్షణకు సంబంధించిన రహస్యాలను పొందుపరుస్తున్నారన్న ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. లైంగిక వేధింపుల ఆరోపణల కేసు 2015లో, అత్యాచారం కేసు 2017లో ముగిసినా, బాధితురాలు కేసు విచారణను పునఃప్రారంభించాలని డిమాండ్ చేశారు.