అంతర్జాతీయం

చిన్నతనం నుంచే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లామాబాద్: అంతర్జాతీయ ఉగ్రవాదిగా భద్రతా మండలి ప్రకటించిన జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మసూద్‌ను చిన్నతనం నుంచే ఉగ్రవాదం వైపు అడుగులు వేశాడు. పాకిస్తాన్ గూఢచారి ఏజన్సీ (ఐఎస్‌ఐ) అతనిని కరుడుగట్టిన ఉగ్రవాదిగా తీర్చిదిద్దింది. 2001లో భారత పార్లమెంటు భవనంపై దాడి మొదలుకుని ఫిబ్రవరిలో పుల్వామా సంఘటన వరకు ఎన్నో దాడులకు మాస్టర్‌మైండ్‌గా నిలిచిన మసూద్ 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్ స్థాపించాడు. అప్పటినుంచి భారత్‌ను దెబ్బతీసేందుకు అనేక రకాల దాడులకు వ్యూహరచన చేసి సమర్థంగా అమలు చేయగలిగాడు.
యువకులను ఆకర్షించి, వారిని ఇస్లామిక్ ఉగ్రవాదులుగా మార్చి, చివరికి ఆత్మాహుతి దాడులకు పాల్పడేలా మసూద్ ప్రేరేపించాడు. ఎలాంటివారినైనా తన వాగ్దాటితో ఆకట్టుకునే అతను ఎంతోమంది ఫిదాయిలను తయారుచేశాడు. అతని కార్యకలాపాలు ఒక్కొక్కటిగా బయటపడడంతో సుమారు పదేళ్ల క్రితమే అంతర్జాతీయ నిఘా విభాగాలు ప్రపంచ దేశాలకు హెచ్చరికలు జారీ చేశాయి. అల్‌ఖైదాతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని దాడులకు పాల్పడడం జైషే మహమ్మద్ ప్రధాన లక్ష్యంగా నిఘా విభాగాలు చాలాకాలం క్రితమే హెచ్చరించాయి. దీనిపై సుమారు దశాబ్దకాలంగా అతనిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ వచ్చింది. ఎట్టకేలకు అది సఫలీకృతమైంది. 1999లో భారత్ విమానాన్ని హైజాక్ చేసిన ఉగ్రవాదులు తాము బందీలుగా పట్టుకున్న ప్రయాణికులను విడిచిపెట్టాలంటే భారత్ నిర్బంధించిన మసూద్‌ను విడిచిపెట్టాలని బేరసారాలు సాగించింది. గత్యంతరం లేని పరిస్థితుల్లో భారత్ 1999 డిసెంబర్ 31న అతనిని విడిచిపెట్టి, బందీలుగా ఉన్న ప్రయాణికులను రక్షించింది. ఈ సంఘటన మసూద్‌కు, పాకిస్తాన్‌కు తిరుగులేని పేరుప్రఖ్యాతులు తీసుకువచ్చింది. ఇస్లాం మత ఛాందసవాదుల అండదండలు పుష్కలంగా లభించడంతో మసూద్ పూర్తిస్థాయి ఉగ్రవాద చర్యలకు శ్రీకారం చుట్టాడు. అందులో భాగంగానే 31 జనవరి 2000లో అతను జైషే మహమ్మద్‌ను స్థాపించాడు. 1994లో భారత్ భద్రతా దళానికి పట్టుబడిన మసూద్‌కు 2000 సంవత్సరంలో జైషే మహమ్మద్‌ను స్థాపించిన మసూద్‌కు ఏమాత్రం సంబంధం లేదని భారత అధికారులే వ్యాఖ్యానిస్తున్నారు. విమానం హైజాక్‌తో దిగొచ్చిన భారత ప్రభుత్వం తనను విడుదల చేసిన తర్వాత మజూద్ కరడుగట్టిన ఉగ్రవాదిగా మారాడు. ప్రపంచ దేశం ముఖ్యంగా భారతదేశానికి సవాల్‌గా మారాడు. కాశ్మీర్ వేర్పాటువాదులకు జైషే మహమ్మద్ బహిరంగంగానే మద్దతు ఇస్తున్న విషయం తెలిసిందే. భారత్‌లో ఎన్నో ఉగ్రవాద దాడులకు కారకుడైన మసూద్‌పై అంతర్జాతీయ ఉగ్రవాది ముద్ర పడడంతో అతని ఆటలు ఇక సాగవని అంటున్నారు.
అభ్యంతరాలు కన్పించలేదు
బీజింగ్: జైషే మహమ్మద్ చీఫ్ అజర్ మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ తాజాగా సమర్పించిన పత్రాల్లో తప్పుపట్టడానికి లేదా అభ్యంతరాలు తెలపడానికి ఎలాంటి అంశాలు లేవని చైనా ప్రకటించింది. ఇంతకుముందు భారత్ సమర్పించిన పత్రాలు సరిగా లేవని, సంపూర్ణమైన వివరాలను క్రోడీకరించలేదని చైనా తన ప్రకటనలో పేర్కొంది. అయితే, తాజాగా సమర్పించిన పత్రాల్లో మసూద్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించడానికి అవసరమైన అన్ని అంశాలు ఉన్నాయని వ్యాఖ్యానించింది. అందుకే తమ అభ్యంతరాలను వెనక్కి తీసుకున్నామని స్పష్టం చేసింది.