అంతర్జాతీయం

డబ్ల్యుటిఓనుంచి బయటకు తెస్తా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 25: ప్రపంచ వాణిజ్యసంస్థ దారుణంగా విఫలమైన వ్యవస్థ అని, తాను అధ్యక్షుడిగా ఏన్నికైతే అమెరికాను అందులోంచి బయటకు తీసుకువస్తానని అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ నామినీ డొనాల్డ్ ట్రంప్ తాజా వ్యాఖ్యలు చేశారు. ఉత్పాదక కార్యకలాపాలను విదేశాలకు తరలిపోయే కంపెనీలపై 30శాతం దిగుమతి సుంకాన్ని కూడా విధిస్తామని వెల్లడించారు. ఎన్‌బిసి టెలివిజన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ సంచలన ప్రకటన చేశారు. ఉత్తర అమెరికా స్వేచ్ఛావాణిజ్య ఒప్పందం రద్దు చేసుకుంటామని ఇంతకుముందే ప్రకటన చేసిన ట్రంప్ ఇప్పుడు చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. ‘‘ఏం జరగదు. బ్రెగ్జిట్ అవుతుందని నేనొక్కడినే ముందు చెప్పాను. దానివల్ల ఏం జరిగింది? ఈయూ నుంచి బ్రిటన్ వైదొలగాలని నిర్ణయం తీసుకున్న రోజు కంటే, ఈ రోజు స్టాక్ మార్కెట్లు గణనీయంగా పెరిగాయి’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే చీలిపోయిన యూరోప్ అమెరికాకు మంచిదేనా అన్న ప్రశ్నకు ఆయన జవాబిస్తూ, యూరోప్ అమెరికాకు గట్టి పోటీదారు అని వ్యాఖ్యానించారు. అయితే ఓ పక్క యూరప్‌తో పోటీ పడుతూ, మరో పక్క ఆ దేశాలకు సాయం చేయటం అన్నది పెద్ద గందరగోళానికి దారితీస్తోందని ట్రంప్ అన్నారు.
హిల్లరీపై ట్రంప్‌పై పైచేయి!
అమెరికా అధ్యక్ష ఎన్నికలు తీవ్రస్థాయిలో ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగిన హిల్లరీ క్లింటన్‌దే అంతిమ విజయం అంటూ ఊహాగానాలు చెలరేగుతున్న నేపథ్యంలో తాజాగా జరిగిన ఓ జాతీయ సర్వే రిపబ్లిక్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతకు సంబంధించిన సంకేతాలు అందించింది. రిపబ్లికన్ అభ్యర్థిగా ట్రంప్ అభ్యర్థిత్వం ఖరారైన తరువాత జరిగిన తొలి జాతీయ సర్వే ఇదే. ఇందులో ట్రంప్‌కు 48 శాతం మంది మద్దతిస్తే హిల్లరీని 45 శాతం మంది మాత్రమే బలపరిచారు. వీరిద్దరి మధ్యా తేడా స్వల్పమే అయినప్పటికీ ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అనేక రకాలుగా ప్రాధాన్యతను సంతరించుకుందని చెబుతున్నారు. సిఎన్‌ఎన్/ఓఆర్‌సిలు ఈ సర్వేను నిర్వహించాయి. సాధారణంగా ఆయా పార్టీల అభ్యర్థిత్వం ఖరారైన తరువాత రంగంలో మిగిలిన వారికి ప్రజాదరణ పెరగడం అన్నది జరుగుతుంది. ఇప్పటికే ట్రంప్‌కు సంబంధించి రిపబ్లికన్ పార్టీ తమ నిర్ణయాన్ని ప్రకటించింది కాబట్టే ఈ తాజా ఆధిక్యత ఆయనకు లభించినట్టుగా చెబుతున్నారు. మరోపక్క ఫిలెడెల్ఫియాలో మంగళవారం నుంచి జరుగుతున్న డెమోక్రటిక్ పార్టీ జాతీయ సదుస్సులో క్లింటన్ అభ్యర్థిత్వం కూడా ఖరారైపోతుంది. అభ్యర్థిత్వం ఖారారు తరువాత ట్రంప్ ధోరణిలో మార్పు వచ్చిందని ఈ జాతీయ సర్వే నిర్వహించిన సంస్థలు తెలిపాయి.