అంతర్జాతీయం

ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టె దిష్టిబొమ్మ ఊరేగింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనీలాలలో బుధవారం ఫిలిప్పీన్స్ అధ్యక్షుడు రోడ్రిగో డ్యూటెర్టె దిష్టిబొమ్మను ఊరేగిస్తున్న వేలాది మంది కార్మికులు.
అనంతరం అధ్యక్ష భవనం ముందు దీనిని దహనం చేశారు. అంతర్జాతీయ కార్మిక దినోత్సవం సందర్భంగా వేలాది మంది కార్మికులు నిరసన ర్యాలీలు నిర్వహించారు. కార్మిక వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నాడంటూ డ్యూటెర్టెపై ఆరోపణలు గుప్పించారు. దేశంలో సరైన పారిశ్రామిక విధానం లేదని, ఫలితంగా ఆర్థిక వ్యవస్థ దారుణంగా పతనమవుతున్నదని ఆరోపించారు. ఉద్యోగావకాశాలు అసలే లేవని, వివిధ కర్మాగారాల్లో పని చేస్తున్నవారికి కనీస సౌకర్యాలు కూడా మృగ్యమయ్యాయని ధ్వజమెత్తారు. తమ డిమాండ్లను వెంటనే పరిష్కరించి, కర్మాగారాలు, ఉత్పత్తి కేంద్రాల్లో వౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని వారు కోరారు.
*