అంతర్జాతీయం

గాజా మిలిటెంట లరాకెట్ దాడులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గాజా సిటీ (పాలస్తీనా భూభాగం), మే 5: పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి తీవ్ర స్థాయిలో పోరు చోటు చేసుకుంది. గాజా మిలిటెంట్లు తాజాగా ఆదివారం తెల్లవారు జామున ఇజ్రాయెల్‌పై రాకెట్లతో భీకర దాడికి దిగారు. దీంతో ఇజ్రాయెల్ కూడా ప్రతీకార దాడులకు పాల్పడింది. ఈ పరస్పర దాడులు మరింత పెరగవచ్చనే భయాందోళనలు నెలకొన్నాయి. ఈ దాడులు, ప్రతిదాడుల కారణంగా ఇరు దేశాల మధ్య యుద్ధ విరమణ సంధి ఊగిసలాటలో పడింది. శనివారం మొదలయి, ఆదివారం కూడా కొనసాగిన ఇజ్రాయెల్ దాడుల్లో నలుగురు పాలస్తీనియన్లు మృతి చెందారని గాజా అధికారులు తెలిపారు. అయితే, ఈ నలుగురిలో ఒక గర్భవతి అయిన మహిళ, ఆమె కుమార్తె ఉన్నట్టు గాజా అధికారులు చేసిన వాదనను ఇజ్రాయెల్ తోసిపుచ్చింది. గాజా సరిహద్దుకు సమీపంలో గల అష్కెలోన్ నగరంపై జరిగిన రాకెట్ దాడిలో ఇజ్రాయెల్‌కు చెందిన ఒక 58 ఏళ్ల వృద్ధుడు మృతి చెందినట్టు ఇజ్రాయెల్ పోలీసులు తెలిపారు. దిగ్బంధంలో ఉన్న గాజా స్ట్రిప్‌ను పాలిస్తున్న హమాస్ (ఇస్లామిస్ట్ మూవ్‌మెంట్) కాల్పుల విరమణ కింద ఇజ్రాయెల్ నుంచి మరిన్ని రాయితీలు కోరుతున్న నేపథ్యంలో ఈ తాజా ఉద్రిక్తతలు నెలకొన్నాయి.