అంతర్జాతీయం

ముప్పు ముంగిట జీవ జాతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పారిస్, మే 6: ఈ భూతలంపై ఉన్న కోటానుకోట్ల జీవరాసులు అంతమయ్యే ప్రమాదం పొంచి ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మానవాళి అభివృద్ధి యావతో చేపడుతున్న చర్యల వల్ల అత్యంత అరుదైన జీవజాతులు అంతరించిపోతున్నాయని ఐక్యరాజ్య సమితి సోమవారం విడుదల చేసిన ఓ చారిత్రక అధ్యయన నివేదికలో స్పష్టమవుతోంది. ప్రకృతి సంపద, స్థితిగతులకు సంబంధించి అలాగే వాటి మనుగడపై మానవాళి చర్యలను విశే్లషిస్తూ ఐరాస ఈ నివేదిక రూపొందించింది. అడవుల నిర్మూలన, చమురు కోసం మహా సముద్రాల అనే్వషణ, భూమి మీద జరుగుతున్న తవ్వకాలు, వాయు కాలుష్యం, ఉమ్మడి ప్రభావం మొత్తం సామాజిక మనుగడకే ప్రమాదం కలిగిస్తుందని ఈ నివేదిక వెల్లడించింది. వీటికి తోడు పర్యావరణ మార్పులు పెను విఘాతంగా మారుతున్నాయని రాబర్ట్ వాట్సన్ సారథ్యంలో జరిగిన 132 దేశాల సమావేశం స్పష్టం చేసింది. మొత్తం 450 మంది ప్రపంచ వ్యాప్త నిపుణులు రూపొందించిన విధానపరమైన నిర్ణయాలను ఈ సమావేశం ధృవీకరించింది. పది లక్షలకు పైగా జంతు, వృక్షజాతులు అంతమైపోయే పరిస్థితి పొంచి ఉన్నాయని, వీటిలో చాలా జీవజాతులు రానున్న కొన్ని దశాబ్దాల లోపే కనుమరుగైపోవచ్చునని ఈ నివేదిక స్పష్టం చేసింది. గత కోటి సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వేగంగా ఈ జీవజాతులు అంతర్ధానమై పోతున్నాయని, వీటిలో మానవాళి కూడా ఒకటని నిపుణులు తెలిపారు. ఇదే జరిగితే 66 మిలియన్ సంవత్సరాల క్రితం సంభవించిన డైనోసర్‌ల సామూహిక అంతర్ధాన పరిస్థితులు పునరావృతమయ్యే ప్రమాదం ఉందని నిపుణులు తెలిపారు. ‘ఇప్పటికిప్పుడు ఈ పరిణామాల వల్ల మానవాళికి ఎలాంటి ముప్పూ లేకపోయినా, దీర్ఘకాలాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఏం జరుగుతుందో చెప్పలేని పరిస్థితే’ అని జర్మనీలోని హెల్మ్‌హోల్స్ పర్యావరణ అధ్యయన పరిశోధనా సంస్థ చైర్మన్ ప్రొఫెసర్ జోసెఫ్ సిటిల్ స్పష్టం చేశారు. ఇలాంటి పరిస్థితులు చేయి దాటిపోకుండా ఉండాలంటే తక్షణ ప్రాతిపదికన పరివర్తనాత్మక మార్పులకు పెద్దపీట వేయాలని, మానవాళి వినియోగించే, ఉత్పత్తిచేసే ప్రతి అంశంలోనూ గుణాత్మకమైన మార్పులు రావలసిన అవసరం ఉందన్నారు. ఆర్థిక జీవన, ఆహార భద్రత, నాణ్యతాయుతమైన ఆరోగ్య జీవన పునాదులనే ధ్వంసం చేసుకుంటున్నామని ఆయన హెచ్చరించారు. అత్యంత వౌలికమైన రీతిలో వ్యవస్థాపరమైన మార్పులు జరిగితేనే ప్రస్తుత ప్రతి కూలతలను నివారించేందుకు ఆస్కారం ఉంటుందని వాట్సన్ స్పష్టం చేశారు. ప్రతి ఏటా 4 వందల మిలియన్ టన్నుల మేరకు విష పదార్థాలను, వ్యర్థాలను, భారీ ఖనిజాలను సముద్రాలు, నదుల్లోకి వదిలేస్తున్నారని వాట్సన్ తెలిపారు. జీవవైవిధ్యం అంతరించిపోవడం, వాతావరణ మార్పులు కూడా జీవజాతుల మనుగడ అత్యంత తీవ్రమైన స్థాయిలో ప్రశ్నార్థకం కావడానికి కారణమవుతుందని అన్నారు.