అంతర్జాతీయం

భారం కానున్న హెచ్-1బీ వీసా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 7: అమెరికా తన హెచ్-1బీ వీసా దరఖాస్తు రుసుమును పెంచడానికి కసరత్తు చేస్తోంది. ఒక అప్రెంటిస్ ప్రోగ్రాంకు నిధులను పెంచడం కోసం ఈ రుసుము పెంచాలని భావిస్తోంది. అమెరికా కార్మిక శాఖ మంత్రి అలెగ్జాండర్ అకోస్టా దేశ చట్టసభ సభ్యులకు ఈ విషయం చెప్పారు. అమెరికా హెచ్-1బీ వీసాల దరఖాస్తు రుసుమును పెంచితే, దాని వల్ల భారతీయ ఐటీ కంపెనీలపై అదనపు భారం పడుతుంది. 2019 అక్టోబర్ ఒకటో తేదీ నుంచి మొదలయ్యే 2019-20 ఆర్థిక సంవత్సరానికి కార్మిక శాఖ వార్షిక బడ్జెట్ గురించి ఆయన సభాకమిటీ ముందు వివరించారు. హెచ్-1బీ వీసాలలో మరింత పారదర్శకతను తెచ్చేందుకు, వీసా కార్యక్రమాన్ని దుర్వినియోగం చేస్తున్న యజమానుల నుంచి అమెరికా ఉద్యోగుల ప్రయోజనాలను మరింతగా కాపాడేందుకు హెచ్-1బీ దరఖాస్తు ఫారంలోనూ కార్మిక శాఖ మార్పులు చేసిందని ఆయన వెల్లడించారు. అయితే, హెచ్-1బీ దరఖాస్తు రుసుమును ఎంత పెంచనున్నారనే విషయాన్ని మాత్రం అకోస్టా వెల్లడించలేదు. గత అనుభవాల రీత్యా చూస్తే హెచ్-1బీ వీసాలపై ఎక్కువగా ఆధారపడిన భారతీయ ఐటీ కంపెనీలపై దరఖాస్తు రుసుము పెంచడం వల్ల అదనపు భారం పడుతుంది. హెచ్-1బీ వీసా అనేది నాన్-ఇమ్మిగ్రేంట్ వీసా. అమెరికా కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం కలిగిన విదేశీయులను ప్రత్యేక స్థానాలలో నియమించుకోవడానికి హెచ్-1బీ వీసా వీలు కల్పిస్తోంది. అమెరికాలోని టెక్నాలజి కంపెనీలు ప్రతి సంవత్సరం భారత్, చైనా వంటి దేశాల నుంచి వేలాది మందిని ఉద్యోగులుగా నియమించుకోవడానికి ఆధారపడుతున్నాయి.