అంతర్జాతీయం

హిల్లరీ గెలిస్తే అన్నీ కష్టాలే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూలై 30: అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ నామినీ అయిన డొనాల్ట్ ట్రంప్ ఉద్యోగాలు, పన్నులు, జాతీయ భద్రత అంశాలపై తన డెమోక్రటిక్ పార్టీ ప్రత్యర్థి హిల్లరీ క్లింటన్ వ్యూహాలను ఎండగట్టారు. నిలకడయిన నాయకత్వాన్ని అందిస్తానని హిల్లరీ క్లింటన్ పార్టీ కనె్వన్షన్‌లో హామీ ఇచ్చిన ఒక రోజు తర్వాత ట్రంప్ తాజా వీడియోలో ఆమె విధానాలను తీవ్రంగా దుయ్యబట్టారు. ‘ది స్పీచ్’ అనే పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఫిలడెల్ఫియాలో గురువారం హిల్లరీ క్లింటన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని అంగీకరిస్తూ చేసిన ప్రసంగాన్ని మీరంతా వినే ఉంటారంటూ ప్రారంభమయింది. అయితే హిల్లరీ క్లింటన్ అధికారంలోకి వస్తే అమెరికాలో పరిస్థితి మరింత దిగజారుతుందని, ఉగ్రవాదం పెరిగిపోతుందని ప్రభుత్వం లోపల ఉండేవారు సురక్షితంగానే ఉంటారు కానీ అమెరికన్లు ఉద్యోగాలు, ఇళ్లు, భవిష్యత్తు పట్ల నమ్మకం కోల్పోతారనే కఠోర సత్యాలు ఆమె ప్రసంగంవెనుక దాగి ఉన్నాయని ఆ వీడియో వ్యాఖ్యానించింది. అంతే కాదు డొనాల్డ్ ట్రంప్ నేతృత్వంలోని అమెరికాలో జనాన్ని తిరిగి పనుల్లోకి వెళ్తారని, మన కుటుంబాలు సురక్షితంగా ఉంటాయని, అమెరికన్ల కలలు తిరిగి నెరవేరుతాయని, అమెరికాను తిరిగి గొప్ప దేశంగా చేసే మార్పులు సంభవిస్తాయని కూడా ఆ వీడియోలో పేర్కొన్నారు.