అంతర్జాతీయం

ప్లాస్టిక్ వ్యర్థాలపై చరిత్రాత్మక ఒప్పందం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెనీవా: ప్లాస్టిక్ వ్యర్థాల నుంచి వెలువడుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ఉద్దేశించిన ఒక న్యాయసమ్మతమయిన చరిత్రాత్మక ఒప్పందాన్ని అమెరికా మినహా ప్రపంచంలోని దాదాపు ప్రతి దేశం ఆమోదించింది. ఐక్యరాజ్య సమితి (ఐరాస) పర్యావరణ విభాగం అధికారులు ఈ విషయం వెల్లడించారు. ఐరాస నేతృత్వంలో ప్లాస్టిక్ వ్యర్థాలు, విషపూరిత, ప్రమాదకర రసాయనాలపై రెండు వారాల పాటు సాగిన సమావేశం ముగింపు సందర్భంగా శుక్రవారం వేలాది రకాల ప్లాస్టిక్ వ్యర్థాల జాడ కనుగొని నియంత్రించడానికి ఉద్దేశించిన ఒక ఒప్పందం కుదిరింది. పనికిరానివిగా భావించి పడేస్తున్న ప్లాస్టిక్ వస్తువులు, సముద్రాలు, నదుల్లోకి చేరుతున్న ప్లాస్టిక్ వ్యర్థాలు, వన్యప్రాణులకు సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. కొన్ని సమయాల్లో ప్రాణాంతకంగా పరిణమిస్తున్నాయి. ఇలాంటి ప్లాస్టిక్ వ్యర్థాలకు సంబంధించిన ఒక చరిత్రాత్మక ఒప్పందంపై 186 దేశాలు సంతకం చేశాయని ఐరాస పర్యావరణ కార్యక్రమానికి చెందిన రోల్ఫ్ పాయెట్ తెలిపారు. ఈ ఒప్పందంపై సంతకం చేసిన దేశాలన్ని తమ సరిహద్దుల వెలుపల ప్లాస్టిక్ వ్యర్థాలను పర్యవేక్షించడం, వాటి కదలికలను, తరలింపులను పసిగట్టడం వంటివి చేయవలసి ఉంటుంది. ఆరోగ్య సంరక్షణ, టెక్నాలజి, ఏరోస్పేస్, ఫాషన్, ఫుడ్ అండ్ బేవరేజెస్ వంటి పరిశ్రమల నుంచి వెలువడే ప్లాస్టిక్ వ్యర్థాలపై ఈ ఒప్పందం ప్రభావం చూపుతుంది. ప్రైవేట్ రంగం, కన్జ్యూమర్ మార్కెట్ వంటి మిగతా ప్రపంచానికి కూడా ఇది చాలా గట్టి రాజకీయ సంకేతాలు పంపిస్తోందని పాయెట్ పేర్కొన్నారు. అమెరికా వంటి చాలా కొన్ని దేశాలు ఈ ఒప్పందంపై సంతకం చేయకపోయినప్పటికీ, ఈ దేశాలు ఒప్పందం కుదుర్చుకున్న దేశాల్లోకి ప్లాస్టిక్‌ను పంపించినప్పుడు ఒప్పందం ప్రభావం పడుతుందని పాయెట్ వివరించారు. ఈ ఒప్పందం కుదరడానికి నార్వే చొరవ తీసుకుందని పేర్కొన్నారు.