అంతర్జాతీయం

సహకారం మరింత బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనోయి, మే 12: భారత్, వియత్నాంలు రక్షణ, భద్రత, శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన వినియోగం, అంతరిక్షం, చమురు- సహజ వాయువు, పునరుత్పాదక ఇంధన రంగాలలో పరస్పర సహకారాన్ని మరింత పెంచుకోవాలని అంగీకారానికి వచ్చాయి. భారత ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్య నా యుడు తన నాలుగు రోజుల వియత్నాం పర్యటనను ఆదివారం ముగించుకున్నారు. వెంకయ్య నాయుడు తన పర్యటనలో వియత్నాం ఉపాధ్యక్షుడు డాంగ్ థి నోక్ థిన్, ప్రధానమంత్రి నుయెన్ జువాన్ ఫుక్, నేషనల్ అసెంబ్లీ చైర్‌పర్సన్ నుయెన్ థి కిమ్ నాన్‌లతో చర్చలు జరిపారు. ‘ఉప రాష్టప్రతి వియత్నాం నేతలతో జరిపిన విస్తృత చర్చలు ఫలప్రదమయ్యాయి. ద్వైపాక్షిక, బహుపాక్షిక సహకారానికి సంబంధించి విస్తృత స్థాయిలో ఈ చర్చలు జరిగాయి’ అని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. రక్షణ, భద్రత, శాంతియుత ప్రయోజనాల కోసం అణు ఇంధన వినియోగం, అంతరిక్షం, చమురు- సహజ వాయువు, పునరుత్పాదక ఇంధనం, వ్యవసాయం, ఆవిష్కరణ-ఆధారిత రంగాలలో సహకారాన్ని మరింత పటిష్టం చేసుకోవాలని ఇరు దేశాలు అంగీకారానికి వచ్చాయని వివరించింది. భారత్‌కు వియత్నాం ఒక ముఖ్యమయిన వాణిజ్య భాగస్వామి. ఈ రెండు దేశాల ద్వైపాక్షిక వాణిజ్యం గత సంవత్సరం 14 బిలియన్ డాలర్లు. మూడు సంవత్సరాల క్రితం 7.8 బిలియన్ డాలర్లు ఉన్న ద్వైపాక్షిక వాణిజ్యం దాదాపు రెండింతలు పెరిగింది. ఉప రాష్టప్రతి వెంకయ్య నాయుడు, వియత్నాం ప్రధానమంత్రి ఫుక్ ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులను మరింత పెంచుకోవాలనే నిబద్ధతను వ్యక్తం చేశారు. అలాగే పర్యాటక, వాణిజ్య రంగాలను ముందుకు తీసికెళ్లడానికి, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలను మరింత పెంపొందించడానికి ఇరు దేశాల మధ్య నేరుగా గగనతల అనుసంధానతను కల్పించుకోవాలని అంగీకారానికి వచ్చారు. జాతీయ సార్వభౌమాధికారాన్ని, అంతర్జాతీయ చట్టాలను గౌరవిస్తూ ఇండో-పసిఫిక్ రీజియన్‌ను ఒక శాంతియుతమయిన, సుసంపన్నమయిన ప్రాంతంగా నిర్మించుకోవలసిన ఆవశ్యకతను ఇరు దేశాలు పునరుద్ఘాటించాయని ఆ ప్రకటన వెల్లడించింది. భారత్ దీర్ఘకాలికంగా అభివృద్ధి భాగస్వామిగా కొనసాగుతున్నదని వియత్నాం నేతలు ప్రశంసించారు. వియత్నాంలో చేపట్టిన పలు ప్రాజెక్టులకు ఆర్థిక సహకారాన్ని అందిస్తున్నందుకు వారు కృతజ్ఞతలు తెలిపారు. భారత్‌ను సందర్శించాల్సిందిగా వియత్నాం ఉపాధ్యక్షుడు థిన్‌ను ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు ఆహ్వానించారు.