అంతర్జాతీయం

ఇద్దరి కాల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాక్స్‌బజార్ (బంగ్లాదేశ్), మే 15: రోహింగ్యా లను మలేషియాకు అక్రమంగా రవాణా చేస్తున్నారని వార్తలు వెలువడిన నేపథ్యంలో ఇద్దరు అనుమానితులను బంగ్లాదేశ్ పోలీసులు కాల్చిచంపారు. 103 శరణార్థులను దేశ సరిహద్దులు దాటించి మలేషియాకు అక్రమంగా తరలిస్తున్నారని అనుమానించిన పోలీసులు వారిని లొంగిపోవాల్సిందిగా ఆదేశించారు. అయితే, వారు పోలీసులపై కాల్పులు జరిపినట్టు ఆత్మరక్షణ కోసం ఎదురుకాల్పులు తప్పలేదని టెన్‌కాఫ్ పోలీస్ అధికారి ప్రదీప్ కుమార్ దాస్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. నాలుగేళ్లుగా రోహింగ్యాల అక్రమ రవాణా సాగుతున్న వార్తలు వస్తున్నా ఈ కేసుకు సంబంధించి కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. దేశంలోకి అక్రమంగా చొరబడిన రోహింగ్యాలు వివిధ ప్రాంతాల్లోనూ, ప్రభుత్వ శిబిరాల్లోనూ తలదాచుకుంటున్నారు. ఈ విధంగా మైన్మార్ నుంచి వచ్చి బంగ్లాదేశ్‌లో ఆశ్రయం పొందిన రోహింగ్యాలు సుమారు 7,40,000 మంది ఉంటారని అధికారుల అంచనా. ఇటీవల కాలంలో మలేషియా తదితర ప్రాంతాలకు రోహింగ్యా యువతులను తరలించడం మరింత ఎక్కువైంది. వివిధ సందర్భాల్లో పోలీసులు స్పందించడంతో 69 మందిని రక్షించగలిగారు. అయితే, కనీసం 23 మంది యువతులను అక్రమ రవాణాదారులు మలేషియాకు తరలించినట్టు సమాచారం. కాగా, రోహింగ్యాల తరలింపు సమాచారం అందుకున్న పోలీసులు ఆ ప్రయత్నాన్ని అడ్డుకోగా ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ సంఘటనలో ఇద్దరు అనుమానితులు అక్కడికక్కడే మరణించారు.