అంతర్జాతీయం

లంకలో కర్ఫ్యూ ఎత్తివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొలంబో, మే 15: ఉగ్రదాడి, ముస్లిం వ్యతిరేక అల్లర్లతో అట్టుడికిన శ్రీలంకలో దేశవ్యాప్తంగా విధించిన కర్ఫ్యూను బుధవారం పూర్తిగా ఎత్తివేశారు. మంగళవారం పాక్షికంగా కర్ఫ్యూను సడలించినా కొన్ని ప్రాంతాల్లో మళ్లీ అలర్లు చెలరేగడంతో బుధవారం ఉదయం వరకూ కొనసాగించారు. మంగళవారం రాత్రి ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకపోవడంతో బుధవారం ఉదయం 6 గంటల కల్లా కర్ఫ్యూను పూర్తిస్థాయిలో ఎత్తివేశారు. దీంతో దేశవ్యాప్తంగా సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. పాఠశాలలు, కార్యాలయాలు, వ్యాపార సంస్థలు యధావిధిగా తెరుచుకున్నాయి. ముస్లింలకు చెందిన నివాసాలు, దుకాణాలు, వ్యాపార సంస్థలపై మూకుమ్మడి దాడులు జరగడంతో సోమవారం దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. ఈ అల్లర్లకు సంబంధించి 60మందికి పైగా అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అల్లర్లలో వీరి పాత్ర రుజువైతే కనీసం 10 సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని పోలీసు అధికార ప్రతినిధి రువాన్ గుణశేఖర తెలిపారు. పుకార్లు వ్యాపించకుండా సోషల్ మీడియాపై నిషేధాన్ని పొడిగించారు. కాగా, కర్ఫ్యూ సమయంలోనూ దాడు లు, లూటీలు జరిగాయని, ఒక వ్యక్తి మరణించాడని ము స్లింలు ఆరోపిస్తున్నారు. పోలీసులు, భద్రతా దళాలు ప్రేక్షకపాత్ర వహించాయని అన్నారు.
అనుమానిత జవాన్‌పై విచారణ
ముస్లిం వ్యతిరేక అల్లర్ల సమయంలో యూనిఫాంలో ఉన్న ఓ జవాన్ చూస్తూ నిలబడి వున్న ఓ వీడియోను సైనికాధికారులు విశే్లషిస్తున్నారు. సైనిక దుస్తులు ధరించి ఉన్న ఆ జవాన్ ఎవరనే దానిపై ఆరా తీస్తున్నారు. తుమ్మొదారా ప్రాంతంలో ముస్లింలపై దాడులు జరుగుతున్న ఆర్మీ దుస్తుల్లో ఓ వ్యక్తి ప్రేక్షక పాత్ర వహించాడని, అతను సైన్యానికి చెందిన జవానా లేక ఆర్మీ దుస్తులు ధరించిన అనుమానితుడా అనే దానిపై కూలంకషంగా విచారణ చేపట్టారు. అతను సైనిక జవాన్ అయిన పక్షంలో కచ్చితంగా అతనిపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని ఆర్మీ అధికారి ఒకరు స్పష్టం చేశారు.