అంతర్జాతీయం

ఆటోమొబైల్ టారిఫ్‌లు వాయిదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 18: ఆటోమొబైల్స్‌పై టారిఫల్‌లు ఆరునెలలు వాయిదావేస్తున్నట్టు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. యూరప్ , జపాన్ వాణిజ్య చర్చలకు సంసిద్ధత వ్యక్తం చేసినందున అమెరికా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకే ఆటోమొబైల్స్ విడిబాగాలపై టారిఫ్ విషయంలో వేచిచూడాలని ట్రంప్ నిర్ణయించుకున్నారు. ట్రంప్ ప్రకటించిన బహుముఖ వాణిజ్య యుద్ధానికి ఇది తాత్కాలిక ఉపశమనంగా చెప్పవచ్చు. యూరప్, జపాన్ వాణిజ్య చర్చలు సారాంశం 180 రోజుల్లో వెల్లడించాలని అమెరికా వాణిజ్య ప్రతినిధి రాబర్ట్ లైథిజెర్‌కు అధ్యక్షుడు ఆదేశించారు. ట్రంప్ అనేక సందర్భాల్లో యురోపియన్ యూనియన్‌పై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. అమెరికాను చైనా కంటే దారుణంగా చూస్తున్నారని ఇటీవలే ఆయన ఆరోపించారు. ‘మా రైతుల బాగోగులు వారికి పట్టదు. మా కార్లు వారికి అక్కర్లేదు. బిస్కెట్ల మాదిరిగా మెర్సిడెజ్ బెంజ్ అమెరికాకు పంపుతారు’అని ట్రంప్ తీవ్రంగా విరుచుకుపడ్డారు. కార్లు సహా అనేక అనేక వాణిజ్య ఒప్పందాలపై అమెరికాతో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఈయూ వాణిజ్య కమిషనర్ సిసిలియా మామ్‌స్టామ్ వెల్లడించారు. అసహజమైన విదేశీ పోటీ వల్ల తన ఆటోమొబైల్ రంగం నష్టపోతోందని ట్రంప్ ఓ కార్యక్రమంలో ఆందోళన వ్యక్తం చేశారు. ఇందులో భాగంగానే స్టీల్, అల్యూమినియం దిగుమతులపై భారీగా పన్నులు విధించారు.