అంతర్జాతీయం

యుద్ధాన్ని కోరడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దుబాయ్, మే 19: తాము పర్షియా గల్ఫ్‌లో యుద్ధాన్ని కోలుకోవడం లేదని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. అయితే, ఆత్మరక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పింది. తమ దేశంలోని ఇంధన వనరులపై ఇరాన్ పదేపదే దాడులు చేస్తున్నదని సౌదీ ఆరోపించింది. ఇలాంటి కవ్వింపు చర్యలను తిప్పికొడతామని హెచ్చరించింది. అయితే, ఇరాన్‌తో యుద్ధం చేయాలన్న ఆలోచన తమకు ఏమాత్రం లేదని, అవసరమైతే మాత్రం అందుకు వెనక్కుపోమని కూడా సౌదీ తెలిపింది. ఎమెన్ రెబల్స్ ఇటీవల సౌదీ పైప్‌లైన్‌పై డ్రోన్లతో దాడి చేయడం సౌదీ ఉన్నత దౌత్యాధికారి అల్‌జుబేర్ ఒక ప్రకటనలో తెలిపారు. సీనియర్ మిలటరీ అధికారి ఒకరు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావించారు. తాము యుద్ధానికి ప్రేరేపించడం లేదని తెలిపారు. ఎవరైనా దాడి చేస్తే తిప్పికొట్టడానికి ఏమాత్రం సందేహించబోమని ఆయన అన్నారు. ఇటీవల అమెరికా యుద్ధ నౌకలను భారీ ఎత్తున మందుగుండు సామాగ్రిని తరలించింది. దీంతో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. సౌదీ, ఇరాన్ మధ్య యుద్ధం తప్పదన్న వాదన బలంగా వినిపిస్తోంది. ఇలావుంటే, సంప్రదింపులు, చర్చలు ద్వారా పరిస్థితిని చక్కదిద్దుకోవాలని అమెరికా అధ్యక్షుడు ఇటీవల ఇరాన్‌కు చేసిన సూచన ఇక్కడి పరిస్థితి కొంతవరకు మెరుగుపడే వాతావరణం కనిపిస్తోంది. అమెరికా ప్రోత్సాహంతో ఇరాన్‌పై సౌదీ యుద్ధానికి దిగుతుందన్న వాదన బలహీనపడింది. అయితే, ట్రంప్ వాస్తవంగానే సౌదీ, ఇరాన్ మధ్య యుద్ధాన్ని ఆపాలనుకుంటున్నారా? లేదా ప్రపంచ దేశాల విమర్శలకు భయపడి ఇలాంటి ప్రకటన చేశారా అన్నది అనుమానంగానే ఉంది. ప్రపంచంలో ఎక్కువగా ముడిచమురును ఉత్పత్తి చేస్తున్న ఒపెక్ దేశాల్లో ఇరాన్ కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే ఇరాన్‌ను కట్టడి చేయడానికి అమెరికా వ్యూహాన్ని పన్నుతోంది. ఆ దేశం నుంచి ముడిచమురు దిగుమతులను గణనీయంగా తగ్గించాలని ఇప్పటికే ప్రపంచ దేశాలకు సూచించింది. అంతర్జాతీయంగా ఇరాన్‌ను ఒంటరి చేయాలన్న ఆమెరికా ప్రయత్నానికి సౌదీ మద్దతు ఇస్తున్నదన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.