అంతర్జాతీయం

దూకుడు తగ్గించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 19: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న పలు నిర్ణయాలపై చైనా తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ‘మా దేశం సార్వభౌమాధికారం, ప్రయోజనాలను దెబ్బతీసే ఎలాంటి చర్యలు తీసుకున్నా ఉపేక్షింబోం’అని చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యి హెచ్చరించారు. ఈమేరకు శనివారం ఆయన అమెరికా విదేశాగం మంత్రి మైక్ పాంపియోతో ఫోన్లో సంభాషించారు.
చైనా ప్రయోజనాలకు విఘాతం కలిగే ఎలాంటి దుందుడుకు చర్యలూ తీసుకోవద్దని వాంగ్ స్పష్టం చేశారు. విదేశీ టెలికం కంపెనీలకు సంబంధించి ఇటీవల డొనాల్ట్ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టారు. సమస్యలను సామరస్యపూరితంగా, సుహృద్భావ వాతావణంలో పరస్పర సహకారంతో పరిష్కరించుకుందాం అని మైక్‌కు ఫోన్‌లో సూచించారు. ట్రంప్ ఆదేశాలు చైనా టెలికం దిగ్గజ హువాయిపై తీవ్ర ప్రభావం పడుతుంది. అమెరికా మార్కెట్‌లో ఈ కంపెనీకి మంచి ఆదరణ ఉంది. ఇటీవల ఇరుదేశాల మధ్య టారిఫ్ యుద్ధం సాగుతుంది. ట్రంప్ బహుముఖ వాణిజ్య యుద్ధానికి కాలుదువ్వుతున్నారు. దీన్లో భాగంగానే విదేశీ టెలికాం కంపెనీలను కట్టడి చేస్తూ ఆదేశాలు ఇచ్చారు. అమెరికా, చైనా దేశాల మధ్య తలెత్తిఈ వివాదం ప్రపంచ ఆర్థిక వ్యవస్థనే దెబ్బతీస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. తమ ఉత్పత్తులను ఉద్దేశించి అమెరికా ఇటీవల చేసిన వ్యాఖ్యలను చైనా తీవ్రంగా గర్హించింది. ‘మీ చర్యలు చైనా ప్రయోజనాలను దెబ్బతీస్తున్నాయి. దుందుడుకు నిర్ణయాలకు స్వస్తిచెప్పండి’అని అమెరికా విదేశాంగ మంత్రికి వాంగ్ సూచించారు. పరస్పర సహకారంతోనే సంక్షోభాల నుంచి గట్టెక్కవచ్చని చైనా స్పష్టం చేసింది. విభేదాలు పక్కన బెట్టి పరస్పర గౌరవం, విస్తృతమైన సహకారంతో ముందుకు సాగుదామని తద్వారా ఉభయులం ప్రయోజనం పొందుదామని వాంగ్ పేర్కొన్నారు. చర్చలు, సంప్రదింపుల ద్వారా ఆర్థిక, వాణిజ్య సంబంధమైన సమస్యలను అధిగమించాలని చైనా ఆకాంక్షిస్తున్నట్టు అధికార మీడియా జిన్‌హువా వెల్లడించింది. తైవాన్ సహా పలు అంశాలపై అమెరికాతో మాట్లాడేందుకు తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చైనా ప్రకటించింది.