అంతర్జాతీయం

నొప్పి నివారణకు కొత్త ఎంజైమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 19: శాస్తజ్ఞ్రులు తాజాగా మంటతో కూడిన వాపును నియంత్రించే ఒక ఎంజైమ్‌ను గుర్తించారు. దీంతో ప్రతికూల దుష్ఫలితాలు లేని లేదా చాలా తక్కువ దుష్ఫలితాలను కలిగించే వ్యసనం కాని నొప్పి నివారణ మందులు కనుక్కోవడానికి మార్గం సుగమమయింది. లక్షలాది మంది ప్రజలు నొప్పి నివారణకు ఒపియోయిడ్ ఔషధాలను వాడుతుండటం వల్ల వాటి దుష్ఫలితాలతో అనేక రుగ్మతలు పొందుతున్నారు. వేలాది మంది ప్రజలు ఈ రుగ్మతల కారణంగా చనిపోతున్నారని పరిశోధకులు తెలిపారు. ఈ సమస్య అంతకంతకు పెరుగుతుండటం వల్ల దీర్ఘకాలికంగా నొప్పులతో బాధపడుతున్న వారికి ప్రతికూల దుష్ఫలితాలు లేని లేదా చాలా తక్కువ దుష్ఫలితాలు గల వ్యసనం కాని నొప్పి నివారణ ఔషధాల తయారీ కోసం శాస్తజ్ఞ్రులు శోధిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికాలోని యూనివర్శిటి ఆఫ్ వర్జీనియాలోని కెన్ హు అనే ప్రొఫెసర్, అతని గ్రాడ్యుయేట్ విద్యార్థి మ్యుంగ్‌సున్ శిన్ ఒక ఎంజైమ్‌ను గుర్తించారు. ఈ ఎంజైమ్ నొప్పితో కూడిన వాపును తగ్గించే రసాయనిక సంకేతాలను సృష్టిస్తుంది. సహజంగా లభ్యమయ్యే డయాసిల్‌గ్లిసరోల్ లిపాస్-బేటా (డీఏజీఎల్-బీ) అనే ఈ ఎంజైమ్ నొప్పి నివారణకు ఉపయోగించే కొత్త ఔషధంగా మారే అవకాశం ఉంది.