అంతర్జాతీయం

దాడి చేస్తే.. ఇరాన్ నాశనమే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్: అమెరికా-ఇరాన్ మధ్య గత కొంతకాలంగా నెలకొన్న ఉద్రిక్తతలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఇరాన్ తమ ప్రయోజనాలను దెబ్బతీస్తే దానిని ధ్వంసం చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. ఇరాన్ సంఘర్షణలు కోరుకుంటే అధికారికంగా ఆ దేశానికి ముగింపే అవుతుందని ట్రంప్ స్పష్టం చేశారు. అమెరికాను హెచ్చరించే ప్రయత్నాలు మానుకోవాలని ఆయన ఒక ట్వీట్‌లో హితవు పలికారు. ఇరాన్ నుంచి ముప్పు ఉందన్న సంకేతాల నేపథ్యంలో యుద్ధ విమానాలను, బీ-52 బాంబర్లను అమెరికా గల్ఫ్‌లో మోహరించింది. అవసరం లేని దౌత్య సిబ్బందిని ఇరాక్ నుంచి అమెరికా తరలించడం, అందుకు ఇరాన్ మూకల నుంచి ముప్పు అవకాశం ఉందని కారణంగా చెప్పడంతోపాటు అనేక అంశాలు ఈ రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలను పెంచాయి. అమెరికా ప్రయోజనాలను దెబ్బతీసేందుకు ఇరాన్ దాడులకు తెగబడితే దానిని ధ్వంసం చేస్తామని, అదే దాని అధికారిక అంతానికి నాంది అవుతుందని ప్రకటించారు. ‘ఇరాన్ మాతో యుద్ధం చేయాలనుకుంటోందా, ఇదే జరిగితే సంబంధాలు నాశనం చేసుకున్నట్టే. ఎప్పడు కూడా మమల్ని హెచ్చరించే ధోరణి ప్రదర్శించవద్దు’ అని ట్రంప్ ఒక ట్వీట్ ద్వారా తీవ్రంగా హెచ్చరించారు.
ఇదిలావుండగా, ఆదివారంనాడు కట్యూషా రాకెట్ ఒకటి బాగ్దాద్‌లోని గ్రీన్ జోన్ హౌసింగ్ గవర్నమెంట్ ఆఫీసులు, దౌత్యకార్యాలయాలు, అమెరికా మిషన్‌పై దాడికి దిగింది. అయితే, ఈ దాడికి వెనుక ఎవరి హస్తం ఉందన్న విషయం వెంటనే తెలియకపోయినా అమెరికా మీడియా కథనాల ప్రకారం..ఈ దాడికి ఇరాన్ పాల్పడిందని అమెరికా నేషనల్ సెక్యూరిటీ సలహాదారు జాన్ బోల్టన్ పేర్కొన్నారు. ఇదిలావుండగా, గల్ఫ్‌లో యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో ఇరు దేశాల మధ్య అత్యవసర చర్యలు జరగాల్సిన అవసరం ఉందని సౌదీ అరేబియా అభిప్రాయపడింది. ఇరాన్‌తో యుద్ధాన్ని తాము కోరుకోవడం లేదని, అదే సమయంలో ఎలాంటి దాడులు ఎదురైనా తట్టుకునేందుకు సంసిద్ధంగా ఉండాల్సిన అవసరం కూడా ఉందన్న విషయాన్ని సౌదీ అరేబియా స్పష్టం చేసింది. సౌదీ అరేబియకు చెందిన విదేశీ వ్యవహారాల మంత్రి ఆదెల్ అల్ జుబేర్ సైతం తాము ఇరాన్‌తో యుద్ధాన్ని కోరుకోవడం లేదని, కానీ ప్రత్యర్థి ఏ క్షణంలోనైనా దాడులకు తెగబడితే అందుకు రక్షించుకునేందుకు మార్గాలను అనే్వషించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఒకవేళ వారు (ఇరాన్) యుద్ధానే్న కోరుకుంటే అందుకు దీటుగా సమాధానం తగిన రీతిలో సమాధానం చెప్పేందుకు అన్నివిధాల సంసిద్ధులం కాకతప్పదని ఆయన స్పష్టం చేశారు.