అంతర్జాతీయం

నేపాల్‌లో భారత విద్యార్థులకు ఊరట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, మే 21: త్రిభువన్ యూనివర్సిటీ అనుబంధ కళాశాలలో చదువుతున్న 32 మంది భారతీయ విద్యార్థులు వార్షిక పరీక్షలు రాసేందుకు అనుమతించాలని ఆ యూనివర్సిటీని నేపాల్ సుప్రీం కోర్టు ఆదేశించింది. వీరంతా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులు కానందున పరీక్షలు రాసేందుకు అనుమతించేది లేదని ఇంతకుముందు త్రిభువన్ యూనివర్సిటీ పేర్కొంది. ఈ విద్యార్థులందరూ భారత ప్రభుత్వం నిర్వహించే ‘నీట్’ పరీక్షకు హాజరయ్యారని, అందులో ఉత్తీర్ణత సాధించారని కోర్టు వివరించి పరీక్షకు అనుమతించాలని తీర్పు చెప్పింది. ఈ 32 మంది విద్యార్థులు నేపాల్‌లోని జానకి దేవి మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చదువుతున్నారు. వీరంతా గత ఏడాది డిసెంబర్ 20న జరిగిన పరీక్ష రాయాల్సి వుంది. ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ ఎంట్రన్స్ పరీక్ష రాయనందున వార్షిక పరీక్షలు రాసేందుకు త్రిభువన్ యూనివర్సిటీ అనుమతించలేదు. దీంతో ఆ విద్యార్థులందరూ నేపాల్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు.