అంతర్జాతీయం

ఇండోనేసియా అధ్యక్షుడిగా జోకో విదోదో మళ్లీఎన్నిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జకార్తా, మే 21: ఇండోనేసియా అధ్యక్షుడిగా జోకో విదోదో తిరిగి ఎన్నికయ్యారు. మంగళవారం నాడు జకార్తాలో ఎన్నికల ఫలితాలను విడుదల చేసేముందు దేశవ్యాప్తంగా భారీగా బలగాలను మోహరించారు. బుధవారం నాడు ఫలితాలు ప్రకటించవచ్చునని అందరూ భావించినప్పటికీ ఒక రోజు ముందుగానే ఎన్నికల సంఘం ఫలితాలను ప్రకటించింది. ఎన్నికల్లో భారీగా అవకతవకలు జరిగినట్టు ప్రత్యర్థి అధ్యక్ష అభ్యర్థి ప్రబొవొ సుబియాంటో ఆరోపించారు. ఎన్నికల ఫలితాలు వెలువడే లోపల భారీగా దాడులు జరుగుతాయనే వార్తల నేపథ్యంలో అమెరికా ఎంబసీ వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. 67 ఏళ్ల మాజీ మిలిటరీ అధికారి అయిన సుబియాంటో ఎన్నికల్లో విదోదో అక్రమాలకు పాల్పడినట్లు, ఎన్నికల సంఘం ఎన్నికలను సరిగా నిర్వహించలేదని తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. ఏప్రిల్ 17న దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగినప్పటికీ అల్లర్లు జరుగుతున్న నేపథ్యంలో ఫలితాలు ప్రకటించడంలో తీవ్రంగా ఆలస్యం జరిగింది. 2014లో జరిగిన ఎన్నికల్లోనూ విదోదో చేతిలో సుబియాంతో పరాజయాన్ని చవిచూశారు.