అంతర్జాతీయం

బంధానికి మరింత బలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్‌కెక్, మే 21: షాంఘై సహకార మండలి (ఎస్‌సివో) రెండు రోజుల భేటీ కోసం ఇక్కడికి వచ్చిన భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ ఖిర్గిజ్ విదేశాంగ మంత్రి చింగిజ్ ఐదార్ బెకోవ్‌తో విస్తృత స్థాయిలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. వీరి మధ్య జరిగిన చర్చలు రెండు దేశాల సంబంధాలను పెంపొందించే రీతిలో ఉత్పాదక స్థాయిలో సాగాయి. ఈ చర్చల్లో భాగంగా ఉగ్రవాదం సహ అనేక అంశాలు ప్రధానంగా ప్రస్తావనకు వచ్చాయి. అలాగే రక్షణ, రాజకీయాలు, వాణిజ్యం, పెట్టుబడులు, ఆరోగ్యం, సామర్థ్య నిర్మాణం, ప్రజా సంబంధాలను పెంపొందించుకోవడంపై ఇరు దేశాల విదేశాంగ మంత్రులు ప్రధానంగా చర్చించారని భారత విదేశీ వ్యవహారాల ప్రతినిధి రవీష్ కుమార్ తెలిపారు. మంగళవారం ఖిర్గిజ్ రాజధాని నగరమైన బిష్‌కెక్‌కు చేరుకున్న సుష్మా స్వరాజ్‌కు సంప్రదాయ రీతిలో ఘన స్వాగ తం లభించిందని ఆయన తెలిపారు. రెండు రోజుల పాటు జరిగే షాంఘై సహకార మండలి సమావేశాల్లో భాగంగా సభ్య దేశాల విదేశాంగ మంత్రులతో సుష్మా స్వరాజ్ చర్చలు జరుపుతారు. అంతర్జాతీయ, ప్రాం తీయ ప్రాధాన్యత కలిగిన అంశాలతో పాటు వచ్చే నెల 13-14 తేదీల్లో జరిగే శిఖరాగ్ర సదస్సు నిర్వహణ ఏర్పాట్లను కూడా ఈ సందర్భంగా సమీక్షిస్తారని రవీష్ కుమార్ తెలిపారు. 2017లో భారత్‌కు షాంఘై కూటమిలో పూర్తి స్థాయి సభ్యత్వం లభించింది. అంతకు ముందు వరకూ దీనిపై చైనా అధిపత్యమే కొనసాగేది. ఎప్పుడైతే భారత్‌కు ఈ కూటమిలో ప్రాధాన్యత లభించిందో అప్పటి నుంచి ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలపై దీని సభ్య దేశాల ప్రభావం పెరుగుతూ వచ్చింది. అంతేకాదు మొత్తం ఆసియా అంతా దీని ప్రాబల్యం విస్తరించే పరిస్థితి కూడా నెలకొంది. ఈ కూటమి సభ్య దేశాలతో భద్రతా పరమైన సంబంధాలను పెం ఘపొందించుకునే అంశంపై భారత్ క్రియాశీలకంగా ముందుకు సాగుతోంది.
రష్యా, చైనా, ఖిర్గిజ్, ఖజకిస్థాన్, ఉబ్జెకిస్థాన్ దేశాల అధ్యక్షుల క్రియాశీలక ప్రమేయం కారణంగా షాంఘై సహకారం కూటమి ఆవిర్భవించింది. యూరో-ఆసియాలోని దేశాల భద్రత, ఆర్థికపరమైన అంశాలపైనా ఈ కూటమి దృష్టి పెడుతుంది. 2017లో భారత్‌తో పాటు పాకిస్తాన్ కూడా ఇందులో సభ్యత్వం లభించింది.
చిత్రం...ఖిర్‌గిజ్ విదేశాంగ మంత్రి హైదార్‌బెకోవ్‌తో ద్వైపాక్షిక చర్చల అనంతరం
కరచాలనం చేస్తున్న భారత విదేశాంగమంత్రి సుష్మా స్వరాజ్