అంతర్జాతీయం

ప్రైవేటీకరణతోనే ఆర్థికాభివృద్ధి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 21: కేంద్రంలో తదుపరి పాలనాపగ్గాలు చేపట్టనున్న ప్రభుత్వం పెద్దయెత్తున ప్రైవేటీకరణకు తెరలేపాల్సిన అవసరం ఉందని ప్రఖ్యాత ఆర్థిక నిపునిపుణుడు, భారతీయ మూలాలున్న అమెరికన్ అరవింద్ పనగారియా సూచించారు. ప్రత్యేకించి ప్రస్తుతం ప్రభుత్వ నిర్వహణలోని అండర్‌టేకింగ్ రంగాలను ప్రైవేటీకరించడం ద్వారా సరికొత్త అంతర్జాతీయ వాణిజ్య ఒడంబడికలతో దేశ శీఘ్రతర ఆర్థికాభివృద్ధికి మార్గం సుగమం చేసుకోవాలని ఆయన హితవుపలికారు. అలాగే ఆర్థిక రంగాన్నంతటినీ, కేంద్ర మంత్రిత్వ శాఖలను బలోపేతం చేసుకోవడంపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్‌ఐటీఐ ఆయోగ్ సంస్థకు తొలి వైస్ చైర్మన్‌గా 2015 జనవరి నుంచి ఆగస్టు 2017 వరకు పనగారియా పనిచేశారు. కాగా 23న జరిగే ఎన్నికల ఫలితాల ప్రకటన అనంతరం కేంద్రంలో అధికారంలోకి వచ్చే ప్రభుత్వం ఏ ప్రాధాన్యతలను అనుసరించాలన్న పీటీఐ ప్రశ్నకు ఆయన స్పందిస్తూ ‘దేశ సమగ్ర ఆర్థికాభివృద్ధిపై నిబద్ధతతో వ్యవహరించడం ప్రప్రథమంగా అనుసరించాల్సిన అంశమ’ని సూచించారాయన. ప్రైవేటు రంగంలో పెట్టుబడులు పెంచడం ఇందుకు బాగా దోహదం చేస్తుందని, అలాగే కేంద్ర మంత్రిత్వ శాఖలను సైతం కనీసం 30కి తగ్గించడం ద్వారా వాటిని అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా తీర్చిదిద్ది, పాలనా వ్యవహారాలను మరింత సమర్థవంతంగా అమలయ్యేలా చూడాలని పనగారియా సూచించారు. ప్రస్తుతం భారత్‌కు సుమారు 50కి పైగా మంత్రిత్వ శాఖలు ఉన్నాయని, ఇలా అధిక స్థాయిలో మంత్రిత్వ శాఖలు ఉండటం వల్ల విధాన నిర్ణయాలు చేయడంలో జాప్యం చోటుచేసుకునే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు.