అంతర్జాతీయం

కొత్త సర్కారుకు కత్తిమీద సామే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 21: భారతదేశంలో ఈనెల 23న సార్వత్రిక ఎన్నికల ఫలితాల తర్వాత కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయే ప్రభుత్వం ముంగిట పెను సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుందని అమెరికాలోని పలువురు ప్రముఖ భారత నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా కేంద్రంలో అధికారంలోకి వచ్చే కొత్త ప్రభుత్వం విదేశీ పాలసీ నిర్ణయాలు తీసుకోవడంలో కఠిన పరీక్షలను చవిచూడాల్సి ఉంటుందని వారు అంటున్నారు. ‘్భరత్‌లో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా ఆర్థిక వ్యహారాల్లో భాగంగా విదేశీ విధానాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో కఠిన పరీక్షలను ఎదుర్కోవాల్సి ఉంటుంది’ అని ఫారిన్ రిలేషన్స్ కౌన్సిల్‌కు చెందిన అలీస్సా ఎయిరెస్ పీటీఐ ప్రతినిధికి తెలిపారు. ‘మా టైమొచ్చింది. ప్రపంచంలో భారత్ తన స్థానాన్ని ఎలా నిలుపుకోగలదో’ అన్న పుస్తక రచయిత కూడా అయిన ఎయిరెస్ గతంలో బరాక్ ఒబామా అమెరికా అధ్యక్షుడిగా ఉన్న కాలంలో తనదైన రీతిలో చాలాకాలంపాటు సేవలు అందించారు. భారత్‌లో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం వల్ల రానున్న రోజుల్లో రక్షణ, భద్రత మెరుగుపడడంతోపాటు ఇరుదేశాల మధ్య వాణిజ్య, ఆర్థికపర అంశాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. కార్నెజీ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్‌కు చెందిన ఆష్‌లీ టెల్లిస్ ‘ఇబ్బందులు పుష్కలం’ అనే టైటిల్‌తో రాసిన వ్యాసంలో భారత్‌లో వచ్చే కొత్త ప్రభుత్వంతో విదేశీ విధానాలు మరింత కఠినం కానున్నాయని అభిప్రాయపడ్డారు. నరేంద్ర మోదీ కేంద్రంలో మళ్లీ ప్రధాని అయితే, భారత్ ముంగిట ఎన్నో సవాళ్లు ఎదురుకానున్నాయని అభిప్రాయపడ్డారు. కేంద్రంలో అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా గత కొంతకాలంగా ఎదుర్కొంటున్న అనేకానేక సమస్యలతోపాటు వ్యవస్థలను మరింత పటిష్టం చేసే దిశగా ముందుకు సాగే దిశగా పయనిస్తే మనుగడ బాగుంటుందని పేర్కొన్నారు. కేంద్రంలో అడుగిడే కొత్త ప్రభుత్వం ఏదైనా విదేశీ ఆర్థిక సంస్కరణలను మరింత బలపడే దిశగా ముందుకు సాగితే రానున్న కాలంలో దేశానికి చాలా మేలు జరుగుతుందని స్కూల్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ ఇంటర్నేషనల్ స్టడీస్‌కు చెందిన అసోసియేట్ ప్రొఫెసర్ అభిప్రాయపడ్డారు.