అంతర్జాతీయం

రష్యన్ ఇంటర్‌ఫేస్‌లోకి భారత పర్యాటక వెబ్‌సైట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్కెక్, మే 22: భారత పర్యాటక మంత్రిత్వ శాఖ వెబ్‌సైట్ వచ్చే నెలాఖరుకల్లా రష్యన్ ఇంటర్‌ఫేస్‌లో చోటుచేసుకుంటుంది. అలాగే రష్యన్ భాషలో ‘24 ఇంటు 7’ హెల్ప్‌లైన్ సైతం ఏర్పాటవుతుంది. షాంఘయ్ సహకార సంస్థ (ఎస్‌సీఓ) పరిధిలోని దేశాల నుంచి రష్యా పర్యటనకు వెళ్లేవారికి ఈ సదుపాయం తోడ్పాటునందిస్తుందని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ బుధవారం నాడిక్కడ తెలిపారు. 2001లో రష్యా, చైనా, కిర్గిజ్ రిపబ్లిక్, కజకిస్తాన్, తజకిస్తాన్, ఉజ్బెకిస్తాన్ అధ్యక్షుల శిఖరాగ్ర సమావేశం సందర్భంగా షాంఘయ్‌లో ‘ఎస్‌సీఓ’ ఏర్పాటైంది. 2005 నుంచి భారత్ ఈ ఎస్‌సీఓ మంత్రిత్వ శాఖల స్థాయి సమావేశాల్లో పాల్గొంటోంది. ఐరోపా, ఆసియా దేశాల్లో భద్రత, ఆర్థిక సహకారాలపై భారత్ తన వాణిని వినిపిస్తోంది. ఈ క్రమంలో భారత్, పాకిస్తాన్ దేశాలకు 2017లో ఎస్‌సీఓ సభ్యత్వం దక్కింది. కాగా బుధవారం నాడిక్కడ జరిగిన ఎస్‌సీఓ విదేశీ మంత్రుల మండలి సమావేశంలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ మాట్లాడుతూ దేశాల మధ్య సంబంధ బాంధవ్యాల పటిష్టతకు ప్రజలకు-ప్రజలకు మధ్య పరిచయాలు దోహదపడతాయని అన్నారు. ఇందుకు పర్యాటక రంగం ప్రధాన వేదిక అవుతుందన్నారు. అందువల్ల పర్యాటక రంగాన్ని సాధ్యమైనంత పటిష్టవంతంగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరం ఉందని సూచించారు. ఇందుకు సంబంధించి ఎస్‌సీఓ సంయుక్త కార్యాచరణ ప్రణాళికను రూపొందించుకుని 2019-20లోపు ఈ రంగంలో దేశాల మధ్య పరస్పర సహకారం వృద్ధి చెందేలా లక్ష్యాన్ని నిర్ధేశించుకుని కృషి చేద్దామని సుష్మ సూచించారు. ఎస్‌సీఓ సభ్య దేశాల్లో అధిక శాతం రష్యన్ భాష మాట్లాడే దేశాలే కావడం వల్ల భారత్ కొత్తగా ఏర్పాటు చేస్తున్న వెబ్‌సైట్ సదుపాయం అన్ని దేశాలకూ ఉపయుక్తంగా ఉంటుందని ఆమె అభిప్రాయపడ్డారు.