అంతర్జాతీయం

చైనాతో ద్వైపాక్షిక బంధం బలోపేతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బిష్కెక్, మే 22: గత ఏడాది ఊహాన్ సమ్మిట్‌లో చేసుకున్న ఒప్పందాల అమలుపై భారత విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ చైనా విదేశాంగ మంత్రి వాంగ్ రుూతో చర్చించారు. ఇరుదేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాల బలోపేతానికి తీసుకోవల్సిన చర్యలపై ఆమె వాంగ్‌తో మాట్లాడారు. బుధవారం సుష్మా చైనా విదేశాంగ మంత్రితో భేటీ అయ్యారు. ఖైగైజ్ రాజధానిలో ఏర్పాటైన షాంగై కోపరేషన్ ఆర్గనైజేషన్ కౌన్సిల్(ఎస్‌సీఓ) విదేశాంగ మంత్రుల సమావేశంలో పాల్గొనేందుకు మంగళవారం ఇక్కడకు వచ్చారు. చైనా విదేశాంగ మంత్రితో అనేక ద్వైపాక్షిక అంశాలపై సుష్మా మాట్లాడారు. ఊహాన్ సమ్మిట్‌లో తీసుకున్న నిర్ణయాలు, వాటి అమలు తీరుపై తీసుకోవల్సిన చర్యల గురించి వాంగ్‌తో చర్చించినట్టు విదేశాంగ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ వెల్లడించారు. ఏప్రిల్ 27-28న ఊహాన్ సమ్మిట్‌లో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జి జింపింగ్ అనేక అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. 73 రోజుల పాటు కొనసాగిన డోక్లాం సమస్యతోపాటు సరిహద్దుల్లో చైనా దళాల చొరబాట్లపై మోదీ ఆ సమావేశంలో ప్రస్తావించారు. అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దులో చైనా దళాలు మోహరించడాన్ని భారత్ తప్పుబట్టింది. సరిహద్దు వెంబడి రహదారి నిర్మాణానికి చైనా పూనుకోవడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఊహాన్ సమ్మిట్‌లో ఇరుదేశాల మధ్య తలెత్తిన సమస్యలు పరిష్కరించుకోవాలని చైనా-్భరత్ నిర్ణయించాయి. ఈనేపథ్యంలో సుష్మాస్వరాజ్ పర్యటన ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాతోద్వైపాక్షి సంబంధాలు బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని ఆమె స్పష్టం చేశారు. ఇరుదేశాలు పరస్పర అవగాహన, విశ్వాసంతో ముందుకు సాగాలని, డోక్లాం లాంటి సమస్య పునరావృతం కాకూడదని ఊహాన్ సమ్మిట్‌లో ఇరుదేశాల అధినేతలు నిర్ణయించారు.
ప్రపంచ దేశాలతో వాణిజ్య అంశాల్లో భారత్ పారదర్శక విధానాలను అనుసరిస్తుందని భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ స్పష్టం చేవారు. ఎస్‌సీఓ విదేశీ మంత్రుల సదస్సులో మాట్లాడిన ఆమె వాణిజ్య అంశాలను కూడా ప్రస్తావించారు. రాజకీయ, భద్రత, అభివృద్ధి రంగాల్లో పరస్పరం ఇచ్చిపుచ్చుకునే అవసరం ప్రతి దేశానికీ ఏర్పడిందని ఆమె అభిప్రాయపడ్డిరు. అమెరికా, చైనా దేశాల మధ్య నెలకొన్న వాణిజ్య యుద్ధాన్ని ఆమె పరోక్షంగా ప్రస్తావిస్తూ, భారత్‌కు ఎవరితోనూ భేదాభిప్రాయాలు లేవని వ్యాఖ్యానించారు. వివిధ దేశాలతో తమ వాణిజ్య ఒప్పందాలు పారదర్శంగా ఉన్నాయని అన్నారు. మితిమీరిన పారిశ్రామికీకరణ కారణంగా తలెత్తుతున్న సమస్యలను కూడా ఆమె ఈ సందర్భంగా గుర్తుచేశారు. వాణిజ్యాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని, అదే సమయంలో పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తామని అన్నారు.
సంస్కరణలకు మద్దతివ్వండి
భద్రతా మండలిలో ఐక్య రాజ్య సమితి చేపడుతున్న సంస్కరణలకు మద్దతు ఇవ్వాల్సిందిగా ఎస్‌సీఓ సభ్య దేశాలను సుష్మా స్వరాజ్ కోరారు. భద్రతా మండలిలలో సంస్కరణల కోసం జర్మనీ, జపాన్‌తో కలిసి భారత్ చాలాకాలంగా డిమాండ్ చేస్తున్నది. అదే విధంగా శాశ్వత సభ్యత్వం కోసం కూడా భారత్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నది. అయితే, చైనా నుంచి వ్యతిరేక వ్యక్తమవుతున్నది. ఇలావుంటే, భద్రతా మండలి నిబంధనలను సమయానుకూలంగా సవరించాల్సిన అవసరం ఉందని సుష్మా స్వరాజ్ అభిప్రాయపడ్డిరు. ఈ మహా ప్రక్రియకు ఎస్‌సీఓ సహకరించాలని కోరారు. పర్యావరణ పరిరక్షణకు అవసరమైన చర్యలు తీసుకోవడానికి భారత్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ అంశంపై గత ఏడాది పోలాండ్‌లో జరిగిన శిఖరాగ్ర సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తు.చ తప్పకుండా పాటిస్తుందని సుష్మా తెలిపారు. పర్యావరణంపై ఐక్యరాజ్య సమితి నిర్దేశించిన సూత్రాలను కూడా అమలు చేస్తున్నట్టు చెప్పారు. దీనిపై ప్రజా చైతన్యం కోసం కృషి చేస్తున్నట్టు తెలిపారు.
చిత్రం...చైనా విదేశాంగ శాఖ మంత్రి వాంగ్ ఈతో భారత విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్