అంతర్జాతీయం

ఎవరెస్టును అధిరోహించి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖాట్మండు, మే 23: అంజలి ఎస్ కులకర్ణి అనే భారతీయ మహిళా పర్వతారోహకురాలు బుధవారం ఎవరెస్టు శిఖరంపై నుంచి కిందికి దిగుతూ మృతి చెందారు. దీంతో నేపాల్‌లో ఈ సీజన్‌లో పర్వతారోహణ సాహస యాత్రకు వెళ్లి మృతి చెందిన వారి సంఖ్య 13కు పెరిగిందని గురువారం వెలువడిన ఒక మీడియా కథనం వివరించింది. ముంబయికి చెందిన 54 ఏళ్ల అంజలి క్యాంప్-4కు పైన మృతి చెందారు. ఎవరెస్టు శిఖరాగ్రం నుంచి కిందికి దిగుతూ అనారోగ్యానికి గురయిన ఆమె బుధవారం మృతి చెందారని అరుణ్ ట్రెక్స్‌కు చెందిన అధికారి తుప్‌డెన్ షెర్పా తెలిపారు. అంజలి పర్వతారోహణను అరుణ్ ట్రెక్స్ ఏర్పాటు చేసింది. ప్రపంచంలోనే అత్యంత ఎత్తయిన 8,848 మీటర్ల ఎత్తులో గల ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించి వచ్చే సాహసయాత్రలో పాల్గొని మృతి చెందిన భారతీయ పర్వతారోహకుల్లో అంజలి అయిదో వ్యక్తి. ఇండియన్ ఆర్మీకి చెందిన ఒక సైనికుడు సహా నలుగురు భారతీయులు గత వారం ఈ సాహస యాత్రలో మృతి చెందారు. తన భర్త శరద్ కులకర్ణితో కలిసి అంజలి బుధవారం ఉదయం ఎవరెస్టు శిఖరాన్ని విజయవంతంగా అధిరోహించారని షెర్పాను ఉటంకిస్తూ హిమాలయన్ టైమ్స్ తెలిపింది. రబీంద్ర కుమార్ నేతృత్వంలో ఈ సాహస యాత్రకు వెళ్లిన ఆరుగురు సభ్యుల్లో అంజలి ఒకరు. క్యాంప్-4 నుంచి అంజలి మృతదేహాన్ని కిందికి తీసుకు రావడానికి కృషి చేస్తున్నట్టు నేపాల్ పర్యాటక శాఖకు చెందిన అధికారులు తెలిపారు.