అంతర్జాతీయం

ఈవీఎంల ట్యాంపరింగ్ కష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 23: ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎం) వినియోగంపై ప్రతిపక్షాల నిరసన హోరు కొనసాగుతుండగా, ఈవీఎంలను తారు-మారు (ట్యాంపరింగ్) చేయడం, పెద్ద ఎత్తున రిగ్గింగ్‌కు పాల్పడడం అంత తేలికైన విషయమేమీ కాదని అమెరికా నిపుణుడు ఒకరు తెలిపారు. బీహార్, ఉత్తర్ ప్రదేశ్‌లో స్ట్రాంగ్ రూంలలో భద్రపరిచిన ఈవీఎంలను తారు-మారు చేయడం జరిగిందని పలు ప్రతిపక్షాల నేతలు ఆరోపించారు. ఇలాఉండగా ప్రతిపక్షాల ఆరోపణలను, ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల కమిషన్ (సీఈసీ) తోసిపుచ్చింది. అన్ని ఈవీఎంలూ స్ట్రాంగ్ రూమ్‌లలలో భద్రంగా ఉన్నాయని తెలిపింది. ఇలాఉండగా భారత దేశంలో వినియోగిస్తున్న ఈవీఎంలు సాంకేతికంగా చాలా నాణ్యతతో కూడినవని అమెరికా నిపుణుడు గెల్బ్ పీటీఐ వార్తా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. పాకిస్తాన్, దక్షిణ ఆఫ్రికాలోని పలు ప్రాంతాల్లో ఎన్నికల విధానాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసినట్లు చెప్పారు.