అంతర్జాతీయం

మహిళల పనితీరు మెరుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లాస్ ఏంజిల్స్, మే 23: మహిళల పనితీరుపై అక్కడ నెలకొని ఉన్న ఉష్ణోగ్రత ప్రభావం చూపిస్తుందని, ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద మహిళల పనితీరు మెరుగ్గా ఉంటుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. జర్నల్ ప్లోస్ వన్‌లో ప్రచురితమయిన ఈ అధ్యయనం ప్రకారం ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు మహిళల పనితీరు మెరుగుపడింది. పురుషుల విషయంలో ఇది విరుద్ధంగా ఉంది. ఉష్ణోగ్రత, పురుషుల పనితీరు మధ్య సంబంధం గురించి తక్కువగా వివరించినప్పటికీ, తక్కువ ఉష్ణోగ్రతలలో పురుషులు బాగా పనిచేశారు. ఉష్ణోగ్రత అనేది కేవలం సౌకర్యానికి సంబంధించింది మాత్రమే కాదని, మనుషుల పనితీరుపైనా దీని ప్రభావం ఉంటుందని ఈ అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్సిటి ఆఫ్ సదరన్ కాలిఫోర్నియా (యూఎస్‌సీ)కు చెందిన బృందం ఈ అధ్యయనం నిర్వహించింది. ‘ఉష్ణోగ్రత వల్ల మీరు సౌకర్యంగా ఉన్నారా? లేదా? అనేదే కాకుండా వివిధ ఉష్ణోగ్రతల వద్ద మీ పనితీరు ఎలా ఉందన్న దానిని మేము కనుగొన్నాం’ అని యూఎస్‌సీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న టామ్ చాంగ్ పేర్కొన్నారు. ఈ లేబొరేటరి ప్రయోగంలో మొత్తం 543 మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన చెప్పారు. సుమారు 16 డిగ్రీల సెల్సియన్ నుంచి 33 డిగ్రీల సెల్సియస్ వరకు ఉష్ణోగ్రతను పెంచుతూ వారి పనితీరును పరిశీలించడం జరిగిందని ఆయన వివరించారు.