అంతర్జాతీయం

పుతిన్ అభినందన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో: లోక్‌సభ ఎన్నికల్లో అమోఘ విజయంతో మళ్లీ అధికారాన్ని నిలుపుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గురువారం ప్రత్యేకంగా అభినందించారు. ఈ మేరకు ఆయన గురువారం మోదీకి ఓ సందేశాన్ని పంపారు. ద్వైపాక్షిక సంబంధాల బలోపేతానికి కలిసి పనిచేసేందుకు ఈ సందర్భంగా పుతిన్ సంసిద్థత వ్యక్తం చేశారు. ‘మీ విజయం పట్ల, మీ పనితీరుపట్ల నేనెంతో సంతోషిస్తున్నాను. ఇరు దేశాల ప్రజల మధ్య వందలాది సంవత్సరాలుగా ఉన్న సఖ్యతను, సమగ్రాభివృద్ధిని మీరు ముందుకు తీసుకెళ్లాలి, అలాగే ఇరుదేశాల మధ్య ప్రాధాన్యత గల వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని కొనసాగించాల’ని పుతిన్ సూచించారు.