అంతర్జాతీయం

బ్రిటన్ ప్రధాని ధెరీసా మే రాజీనామా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 24: బ్రిటీష్ కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వం నుంచి తాను వైదొలుగుతున్నట్టు ఆ దేశ ప్రధాన మంత్రి థెరీసా మే శుక్రవారం నాడిక్కడ ప్రకటించారు. వచ్చే జూన్ 7న ఇందుకు సంబంధించిన రాజీనామాను సమర్పిస్తానని ఆమె తెలిపారు. ఐరోపా దేశాల యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు సంబంధించిన ‘బ్రెగ్జిట్’పై మంత్రులను ఒప్పించడంలో విఫలం కావడం వల్లే తానీ రాజీనామాను సమర్పిస్తున్నానని బరువెక్కిన హృదయంతో కన్నీటి పర్యంతమవుతూ ఆమె పేర్కొన్నారు. ‘దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని కొత్త ప్రధాని ఎన్నికకు తాను మార్గం సుగమం చేస్తున్నాన’ని ఆమె అన్నారు. జూన్ 7న తాను రాజీనామా చేసి తదుపరి ప్రధాని ఎన్నికయ్యే వరకు ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతానని పేర్కొన్నారు. ఇప్పటి వరకు దేశానికి సేవచేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని, మిగిలిన జీవితాన్ని ప్రశాంతంగా గడిపేందుకు ఈ రాజీనామా తనకు తోడ్పడుతుందని 62ఏళ్ల థెరస్సా మే తెలిపారు.
బ్రిటన్‌కు ఆమె రెండో మహిళాప్రధాని. మూడేళ్ల ఆమె ప్రధాన మంత్రి హోదాకు ముగింపు పలుకుతున్నారు. కాగా రాణి ఎలిజిబెత్-2కు తన రాజీనామా క్రమాన్ని వివరించానని, ఆమే వచ్చే నెల ప్రథమార్థంలో దేశంలో పర్యటించనున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కార్యక్రమానికి నేతృత్వం వహిస్తారని మే ఈ సందర్భంగా పేర్కొన్నారు. కాగా దేశాన్ని ఆర్థిక లోటు నుంచి గట్టెంక్కించడంతోబాటు నిరుద్యోగితను తగ్గించడం, మానసిక ఆరోగ్యానికి సంబంధించిన నిధులను పెంచడం వంటి తన ఆధ్వర్యంలో చేపట్టిన అనేక అభివృద్ధి కార్యక్రమాలను ఈ సందర్భంగా మే ఏకరవుపెట్టారు. ఇతే తాను ‘బ్రెగ్జిట్’ విషయంలో మాత్రం విఫలమయ్యానని అంగీకరించారు. 28 సభ్యదేశాల ఐరోపా ఆర్థిక విభాగం ‘బ్రెగ్జిట్’ నుంచి బ్రిటన్ గత మార్చి 29 నాటికే వైదొలగాల్సి ఉందని, ఐతే ఆ కాల వ్యవధిలోగా చేయలేక పోయామని, మళ్లీ సవరించిన ‘బ్రెగ్జిట్’ వచ్చే అక్టోబర్ 31 కల్లా జరగాల్సి ఉందని ఆమె చెప్పారు. ఇలావుండగా వచ్చే శుక్రవారం కన్సర్వేటివ్ పార్టీ ఇన్‌ఫ్లుయెన్షియల్ కమిటీలోని పార్లమెంట్ సభ్యులతో సమావేశమైన తర్వాత థెరెస్సా మే తన పదవికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది. జూలై నెలాఖరుకల్లా కొత్త నేత ఎంపిక ప్రక్రియ పూర్తవుతుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. బ్రెగ్జిట్ డీల్‌లో ఎంపీలను ఒప్పించే విషయంలో తాను సర్వవిధాలా ప్రయత్నించానని, మూడు సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందని ఈ సందర్భంగా విషణ్ణవదనంతో ఆమె పేర్కొన్నారు. నా తర్వాత వచ్చే ప్రధాని ప్రజాభిప్రాయం మేరకు నడుచుకుంటారని ఆశిస్తున్నానని అన్నారు. కాగా గురువారం మేతో భేటీ అయిన బ్రిటన్ విదేశీ వ్యవహారాల శాఖ కార్యదర్శి జర్మీహంట్ విలేఖరులతో మాట్లాడుతూ వివాదాస్పద బ్రెగ్జిట్ విత్‌డ్రాయల్ అగ్రిమెంట్ బిల్లును హౌస్ ఆఫ్ కామన్స్ ద్వారా ఆమోదింపజేసుకునేందుకు మే పట్టుదలగా చేస్తున్న ప్రయత్నాలపై అసంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ బిల్లులో ఆమె చేసిన మార్పులపై హంట్‌తోబాటు కేబినెట్ మంత్రులు, హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి సాజిద్ జావిద్ సైతం విముఖత వ్యక్తం చేశారు. ఈ వారారంభంలో హౌస్ ఆఫ్ కామన్స్ నాయకత్వం నుంచి ఆండ్రా లీడ్సమ్ రాజీనామా చేసి వైదొలగడంతో ఆ స్థానంలో కొత్తగా మెల్ స్ట్రైడ్ నాయకత్వ బాధ్యతలు చేపట్టగా, అప్పటి నుంచి థెరస్సా మే బ్రెగ్జిట్‌లో ప్రక్షాళన చర్యలను చేపట్టడం వివాదాస్పదంగా మారింది. 2018 డిసెంబర్‌లో జరిగిన అవిశ్వాస తీర్మాన కార్యక్రమం నుంచి బయటపడినప్పటి నుంచి ఆమెపై రాజీనామాకు ఒత్తిడి పెరుగుతోంది. బ్రెగ్జిట్ తొలివిడత తొలివిడత ప్రయోజనాలు చూసిన తర్వాత తాను వైదొలుగుతానని మే చెబుతూ వచ్చారు.