అంతర్జాతీయం

ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగవుతాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, మే 24: భారత పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లో మళ్ళీ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీ ప్రభుత్వం ఏర్పాటైనందుకు అభినందిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ట్విట్టర్‌లో తెలిపారు. ఈ విజయంతో భారత్-అమెరికా ద్వైపాక్షిక సం బంధాలు మరింత మెరుగవుతాయని, మరిన్ని మంచి పరిణామాలు చోటు చేసుకుంటాయని ఆయన శుక్రవారం ట్వీట్ చేశారు. లోక్‌సభకు జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 543 సీట్లలో 302 సీట్లను బీజేపీ కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. అమెరికా-్భరత్‌ల మధ్య అనాదిగా సత్సంబంధా లు ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య రక్షణ, సైని క, న్యూక్లియర్ ఒప్పందం, వాణిజ్య సంబంధాలు ఇదివరకే బలపడ్డాయి. అమెరికా ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ కూడా మోదీని అభినందిస్తూ ట్వీట్ చేశారు. ఇరు దేశాల మధ్య కొనసాగుతున్న సంబంధాలు మరింత బలపడతాయని తెలిపారు. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యం పట్ల భారత ప్రజల చిత్తశుద్ధిని రుజువు చేశాయని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోని హౌస్ మెజారిటీ నాయకుడు స్టెని హోయర్ కూ డా ప్రధాని మోదీకి, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలకు శుభాకాంక్షలు తెలిపారు. భారత్-అమెరికాల మధ్య సతబంధాలు మరింత పటిష్టవంతమవుతాయని ఆయన ట్వీట్ చేశారు. అమెరికా సెనెటర్ జాన్ కార్నియన్ ప్రధాని మోదీకి శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగుపడతాయని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.