అంతర్జాతీయం

చర్చల ద్వారా విభేదాల పరిష్కారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బీజింగ్, మే 24: భారత్‌లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ శుభాకాంక్షలు తెలపడాన్ని చైనా శుక్రవారం స్వాగతించింది. ఇరు దేశాలు తమ సౌహార్దతను కొనసాగిస్తాయని, చర్చల ద్వారా తమ విభేదాలను పరిష్కరించుకుంటాయనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. ఇమ్రాన్ ఖాన్ గురువారం మోదీని అభినందించడంతో పాటు ప్రాంతీయంగా శాంతి, సౌభాగ్యాల కోసం అతడితో కలిసి పనిచేయాలని కోరుకుంటున్నట్టు చెప్పారు. దీనికి మోదీ స్పందిస్తూ, ‘శుభాకాంక్షలు చెప్పిన మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. మన ప్రాంతంలో శాంతి, అభివృద్ధి కోసం నేను ఎల్లవేళలా ప్రాధాన్యం ఇచ్చాను’ అని పేర్కొన్నారు.