అంతర్జాతీయం

బ్రిటీష్ ప్రధాని రేసులో 8 మంది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లండన్, మే 26: బ్రిటీష్ కొత్త ప్రధానమంత్రి పదవిని చేపట్టేందుకు ఎనిమిది మంది అభ్యర్థులు రంగంలోకి దిగారు. బ్రిటీష్‌లో అధికార కన్సర్వేటివ్ పార్టీ నాయకత్వం నుంచి తప్పుకోవడంతోపాటు ప్రధానమంత్రి పదవి నుంచి సైతం వచ్చే జూన్ 7వ తేదీన వైదొలగుతానని థెరీసా మే ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దేశ అత్యున్నత పదవి అయిన ప్రధానిమంత్రి సీటు కోసం తీవ్ర పోటీ నెలకొంది. ఐరోపా దేశాల యూనియన్ నుంచి బ్రిటన్ వైదొలగేందుకు సంబంధించిన ‘బ్రెగ్జిట్’ లో మంత్రులను ఒప్పించడంలో విఫలం కావడం వల్లే తాను ప్రధానమంత్రి పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయం తీసుకున్నానని థెరీసా మే స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంతేకాకుండా తన స్థానంలో దేశ అత్యున్నత ప్రధాని పదవి కోసం జరిగే ఎన్నికల సుగమం కావడానికి తన వంతు సహకరిస్తానని ఆమె స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రధాని పదవికి ఈనెల మొదటివారంలోనే థెరీసా మే రాజీనామా చేస్తున్నట్టు నిర్ణయాన్ని ప్రకటించారు. కానీ జూన్ 7న మూడురోజులపాటు అధికారిక పర్యటనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత తన రాజీనామాను సమర్పిస్తానని ఆమె పేర్కొన్నారు. అధికార కన్జర్వేటివ్ పార్టీ నాయకత్వం ఎంపిక కోసం జూన్ 10 పోటీ జరుగుతుంది. ఈ పదవి కోసం ఇప్పటికే చాలామంది తమ ప్రయత్నాలను ముమ్మరం చేశా రు. అయితే, దేశ విదేశీ కార్యదర్శి బ్రెక్సిటీర్ బొరిస్ జాన్సన్‌కు ప్రస్తుత ప్రధాని థెరీసా మే తర్వాత ఆ పదవి దక్కేందుకు అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే, అత్యున్నతమైన ఈ కీలక పదవి కోసం ఇప్పటికే ఏడుగురు పోటీల8 ఉన్నారు. యూకే ఎన్విరాన్‌మెంట్ సెక్రెటరీ మిచెల్ గోవ్ సైతం ప్రధాని పదవి రేసులో ఉన్నానని చెప్పకనే చెప్పారు. బ్రెక్సిటీర్ బొరిస్ జాన్సన్‌కు పోటీగా తాను రంగంలోకి దిగుతానని ఆయన చెబుతున్నారు. దేశ ప్రధాన మంత్రి పదవితోపాటు కన్జర్వేటివ్ పార్టీ అధ్యక్ష బాధ్యతలు సైతం చేపట్టేందుకు తాను సంసిద్ధంగా ఉన్నానని ఆయన ధీమా వ్యక్తం చేస్తున్నారు.