అంతర్జాతీయం

అమెరికా వీసా కావాలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వాషింగ్టన్, జూన్ 2: అమెరికాలో విద్య, ఉద్యోగం కోసం యువత ఎంతగానో అర్రులు చాస్తుంది. అయితే, ఇపుడు అగ్రరాజ్యం వీసా పొందాలనుకుంటే అంత ఈజీ కాదు. అమెరికా వీసా పొందాలనుకునేవారికి ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయం ఆశనిపాతం లాంటిదే. అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు ఎవరైనా అక్కడ కొత్తగా రూపొందించిన కఠిన నిబంధనలకు తప్పనిసరిగా కట్టుబడి ఉండాల్సిందే. వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వ్యక్తులు తమ సామాజిక మాధ్యమాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని కచ్చితంగా దరఖాస్తులో పొందుపర్చాల్సి ఉంటుంది. కేవలం విద్య, ఉద్యోగం కోసమే కాకుండా పరిమిత కాలం పాటు అమెరికాను సందర్శించాలనుకునే వారికి (విజిటర్స్ వీసా) సైతం ఈ సరికొత్త నిబంధనలు వర్తిస్తాయి. వీసా కోసం దరఖాస్తు చేసుకునే వ్యక్తులెవరైనా తప్పనిసరిగా సామాజిక మాధ్యమాల్లో పొందుపరచిన తమ వ్యక్తిగత సమాచారాన్ని సైతం ఇకముందు తప్పనిసరిగా పేర్కొనాల్సి ఉంటుందని అమెరికా స్టేట్ డిపార్ట్‌మెంట్ కొత్త నిబంధనలను తీసుకువచ్చింది. వాస్తవానికి ఈ కొత్త నిబంధనలు గత ఏడాది నుంచి అమలు కావాల్సి ఉన్నా, ప్రజాభిప్రాయం మేరకు ఈ సరికొత్త నిబంధనలు శనివారం నుంచి అమల్లోకి వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అమెరికా కోసం దరఖాస్తు చేసుకునే సమయంలో అభ్యర్థులెవరైనా తమతమ సామాజిక మాధ్యమాలకు సంబంధించిన పూర్తి వివరాలు వాస్తవమేనంటూ తెలియజేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆయా వివరాలు తప్పు అని రుజువైన పక్షంలో తర్వాత ఎదురయ్యే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అమెరికా డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్టేట్‌కు చెందిన అధికారి ఒకరు తెలిపారు. కొత్త నిబంధనల ప్రకారం అమెరికా వీసా కోరుకునేవారు సామాజిక మాధ్యమాల్లో తాము ఎవరి పేరుమీద ఉపయోగిస్తున్నారు, దానికి సంబంధించిన ఈమెయిల్ ఐడీ వివరాలు కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ అభ్యర్థి ఎవరైనా తప్పుడు సమాచారం ఇస్తే వారి దరఖాస్తును ప్రాథమిక దశలోనే తిరస్కరించడంతోపాటు నిబంధనల ప్రకారం చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ‘అమెరికాకు విచ్చలవిడిగా తరలివస్తున్న వ్యక్తులను నిరోధించేందుకు ఈ కఠిన నిబంధనలను అమలు చేయాల్సి వస్తోంది. ఇంతకుముందు వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి ఉగ్ర ముఠాలతో సంబంధాలు ఉన్నాయా? లేదా? అనే కోణంలోనే చూసేవారు. కానీ ఇపుడు తాజాగా మారిన కఠిన నిబంధనల నేపథ్యంలో వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారెవరైనా తప్పనిసరిగా తమ తమ సామాజిక మాధ్యమాల సమగ్ర సమాచారాన్ని పొందుపరచాల్సిందే. ఈ వివరాల ఆధారంగానే విచారణ జరిపి వీసాపై తుది నిర్ణయం తీసుకుంటారు.