అంతర్జాతీయం

రష్యా హెలికాప్టర్ కూల్చివేత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాస్కో, ఆగస్టు 1: సిరియాలో రష్యా సైన్యానికి చెందిన ఓ హెలికాప్టర్ కూల్చివేసినట్లు క్రెమ్లిన్ ప్రకటించింది. హెలికాప్టర్‌లో ప్రయాణిస్తున్న అయిదుగురు చనిపోయినట్లు వెల్లడించారు. ‘ఇప్పటివరకు అందిన సమాచారం మేరకు హెలికాప్టర్‌లో ఉన్న వారంతా చనిపోయారు. వాళ్లు వీరోచితంగా చనిపోయారు. అలెప్పోలో మానవీయ సహాయాన్ని అందించి తిరిగి వస్తున్న సమయంలో రష్యాకు చెందిన మిగ్-8 రవాణా హెలికాప్టర్‌ను కూల్చివేయటం జరిగింది. ఇందులో ముగ్గురు సిబ్బంది ఇద్దరు అధికారులు ఉన్నారు’ అని ప్రభుత్వం పేర్కొంది.